Laptop Hacking Prevention: ప్రపంచంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆఫీస్ నుంచి స్కూల్ దాకా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగంతో పని చాలా సులువుగా మారుతోంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల పనిని సులభతరం చేయడానికి ప్రజలు ఆలోచించకుండా వారి కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత వారి మొత్తం డేటా ప్రమాదంలోకి వస్తుంది.


హ్యాకర్లు కూడా మీ ఆన్‌లైన్ యాక్టివిటీని గమనిస్తూ ఉంటారు. ఆపై మోసం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏ పద్ధతుల్లో మోసం జరుగుతుందో అర్థం చేసుకోవడం, వాటిని అనుసరించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో మీతో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోబోతున్నాం. దాని సహాయంతో వైరస్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించిందో లేదో ఈజీగా కనిపెట్టవచ్చు.


వైరస్ మీ డివైస్‌లో ఉన్నప్పుడు మీ ఫైల్స్, యాప్స్ ఓపెన్ అవ్వడానికి సమయం పడుతుంది. కంప్యూటర్ పనితీరు మందగిస్తుంది. పాప్ అప్‌లు, స్పామ్ నిరంతరం కనిపించడం ప్రారంభం అవుతుంది. మీ ల్యాప్‌టాప్ లాక్ అవుతుంది. మీరు దాన్ని యాక్సెస్ చేయలేరు. ఇది మాల్వేర్ వల్ల జరగవచ్చు. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


మీరు హోమ్ పేజీలో మార్పులను కూడా గమనించవచ్చు. తెలియని ప్రోగ్రామ్‌లు మీ సిస్టమ్‌లో రన్ అవుతాయి. మీ మెయిల్ ఖాతా నుంచి బల్క్ ఇమెయిల్స్ సెండ్ అవుతూ ఉంటాయి. సిస్టమ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ పని చేయడం ఆగిపోతుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. మీ సిస్టమ్ పదే పదే క్రాష్ అవుతుంది. కొన్నిసార్లు స్క్రీన్ ఫ్రీజింగ్ గురించి ఫిర్యాదులు కూడా అందుతాయి.


కంప్యూటర్ నుంచి వైరస్ తొలగించడం సాధ్యమే. మీరు కంప్యూటర్ నుంచి వైరస్‌ను తొలగించలేకపోతే నిపుణుల సహాయం తీసుకోవచ్చు. దీనికి ముందు మీరు ఈ చిట్కాలను పాటించండి. వైరస్ లేదా యాంటీ మాల్వేర్ సాధనాన్ని డౌన్‌లోడ్ చేయండి. ఇంటర్నెట్ నుంచి సిస్టమ్‌ను డిస్‌కనెక్ట్ చేసి, సేఫ్ మోడ్‌లోకి ఎంటర్ అవ్వండి. డివైస్‌లో ప్రమాదకరమైన యాప్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయడానికి టాస్క్ మేనేజర్‌ని ఓపెన్ చేయండి. మీ యాంటీవైరస్‌ని ఆన్ చేసి వైరస్‌ కోసం కంప్యూటర్‌ను స్కాన్ చేయండి. ఆపై సిస్టమ్ నుంచి కాష్‌ను క్లియర్ చేసి మళ్లీ అప్‌డేట్ చేయండి. మనం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి వైరస్‌ల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.


 


Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?