Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!

Best Gaming Laptops in Amazon: అమెజాన్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై మనదేశంలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో ఎంఎస్ఐ, లెనోవో, హెచ్‌పీ కంపెనీల ల్యాప్‌టాప్స్ ఉన్నాయి.

Continues below advertisement

Gaming Laptops: భారత మార్కెట్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లకు చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా యువత గేమింగ్ ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్‌లు వేగవంతమైన ప్రాసెసర్, మంచి పనితీరును అందిస్తాయి. కానీ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ధర సాధారణ ల్యాప్‌టాప్‌ల కంటే ఎక్కువ. అయితే ఇప్పుడు మనం తక్కువ ధరకు కొనుగోలు చేయగల గేమింగ్ ల్యాప్‌టాప్‌ల గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఈ-కామర్స్ సైట్ అమెజాన్ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. దీంతో పాటు ఇక్కడ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు.

Continues below advertisement

ఎంఎస్ఐ థిన్ ఏ15 - ఏఎండీ రైజెన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్ (MSI Thin A15 - AMD Ryzen 5 Gaming Laptop)
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.69,990. కానీ అమెజాన్‌లో దీనిపై 30 శాతం తగ్గింపు అందిస్తున్నారు. తగ్గింపు తర్వాత ఈ ల్యాప్‌టాప్ రూ. 48,990కి లిస్ట్ అయింది. ఇందులో ఏఎండీ రైజెన్ 5 7వ తరం ప్రాసెసర్‌ను అందించారు. ఎన్వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్స్ కార్డు కూడా ఇందులో ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా అందించారు. ఇందులో 15.6 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని ద్వారా గొప్ప వీడియో క్వాలిటీ లభిస్తుంది. ఎంఎస్ఐ లాంచ్ చేసిన ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ తేలికైనది, శక్తివంతమైనది. మంచి పనితీరుకు ఈ ల్యాప్‌టాప్ పేరు పొందింది.

Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?

లెనోవో ఎల్‌క్యూక్యూ (Lenovo LOQ - 12th Gen Intel Core i5)
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.95,890గా ఉంది. కానీ అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై 25 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ధర తగ్గింపు తర్వాత ఈ ల్యాప్‌టాప్ రూ. 71,990కి లిస్ట్ అయింది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఐపీఎస్ టెక్నాలజీ ఉన్న 15.6 అంగుళాల డిస్‌ప్లేను ఈ ల్యాప్‌టాప్‌లో చూడవచ్చు. మల్టీ టాస్కింగ్‌కు కూడా ఈ లెనోవో ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది.

హెచ్‌పీ విక్టస్ (HP Victus 12th Gen Intel Core i5)
ఈ హెచ్‌పీ గేమింగ్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.77,566గా ఉంది. కానీ అమెజాన్‌లో వినియోగదారులు ఈ ల్యాప్‌టాప్‌పై 11 శాతం తగ్గింపును పొందుతున్నారు. ఇప్పుడు వినియోగదారులు దీన్ని రూ. 68,990కి కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ఎన్వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్స్ కార్డు కూడా ఉంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో చూడవచ్చు. ల్యాప్‌టాప్ వేడెక్కకుండా థర్మల్ కూలింగ్ సిస్టం కూడా అందించారు.

ఆన్‌లైన్ గేమింగ్‌కు కూడా మనదేశంలో మెల్లగా డిమాండ్ పెరుగుతోంది. యూట్యూబ్‌లో గేమర్లు కూడా బాగా ఎక్కువ అవుతున్నారు. గేమింగ్‌ను కూడా ఫుల్ టైమ్ ప్రొఫెషన్‌గా తీసుకునేవారు పెరుగుతున్నారు. కాబట్టి గేమింగ్ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి.

Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!

Continues below advertisement