Laptop Battery: మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ వేగంగా అయిపోతుంటే అది మీ వర్క్ టైమ్‌ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. దాన్ని మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని సాధారణ సెట్టింగ్స్ సాయంతో మీరు బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవచ్చు. మీ డివైస్‌ని ఎక్కువసేపు ఉపయోగించవచ్చు. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచగల కొన్ని ప్రభావవంతమైన సెట్టింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


పవర్, స్లీప్ సెట్టింగ్స్‌ను మార్చాలి
బ్యాటరీని ఆదా చేయడానికి, ముందుగా పవర్, స్లీప్ సెట్టింగ్‌లను ఆప్టిమైజ్ చేయండి. "కంట్రోల్ ప్యానెల్" లేదా "సెట్టింగ్స్"కి వెళ్లి, "పవర్ & స్లీప్"ని మార్చడం బ్యాటరీపై మంచి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ల్యాప్‌టాప్‌ను పక్కన పెడితే కాసేపటికే స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోయేలా చేయవచ్చు.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!


బ్రైట్‌నెస్ తగ్గించాలి
స్క్రీన్ బ్రైట్‌నెస్ అతిపెద్ద బ్యాటరీ డ్రైనర్. బ్రైట్‌నెస్ తగ్గించడం ద్వారా మీరు బ్యాటరీ లైఫ్‌ని చాలా వరకు ఆదా చేయవచ్చు. మీరు కీబోర్డ్ బ్రైట్‌నెస్ కంట్రోల్ లేదా ల్యాప్‌టాప్ సెట్టింగ్స్‌కు వెళ్లడం ద్వారా దీన్ని సులభంగా అడ్జస్ట్ చేయవచ్చు.


బ్యాటరీ సేవర్ మోడ్‌ని ఆన్ చేయాలి
చాలా ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ సేవర్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఆన్ చేయడానికి "సెట్టింగ్స్"కి వెళ్లి, "బ్యాటరీ" ఆప్షన్‌కి వెళ్లి, "బ్యాటరీ సేవర్"ని ఆన్ చేయండి. ఇది మీ సిస్టమ్‌లో రన్ అవుతున్న అనవసరమైన యాప్‌లను క్లోజ్ చేస్తుంది.


బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన యాప్‌లు, ప్రోగ్రామ్‌లు బ్యాటరీ వినియోగాన్ని పెంచుతాయి. "టాస్క్ మేనేజర్"కి వెళ్లి అనవసరమైన ప్రోగ్రామ్‌లను క్లోజ్ చేసేయండి. తద్వారా బ్యాటరీ ఎక్కువసేపు పని చేస్తుంది.


వైపై, బ్లూటూత్‌ను ఆఫ్ చేయండి
వైపై, బ్లూటూత్‌ను నిరంతరం ఆన్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా పోతుంది. అవి ఉపయోగంలో లేకుంటే వాటిని ఆఫ్ చేయండి. ఈ సాధారణ సెట్టింగ్స్‌ను ఫాలో అవ్వడం ద్వారా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ని మెరుగుపరచవచ్చు. ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కువసేపు పని చేయవచ్చు.


ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే బ్యాటరీ వాడకం మొదలు పెట్టి చాలా కాలం అయిపోతే మనం ఎన్ని టిప్స్ పాటించినా పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ల్యాప్‌టాప్ కొన్నాక సంవత్సరాలు గడిచిపోతే బ్యాటరీ సరిగ్గా పనిచేయనప్పుడు దాన్ని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే పాడైపోయిన బ్యాటరీని ఎన్ని టిప్స్ ఫాలో అయినా బాగు చేయలేం కాబట్టి.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!