Refurbished Laptop Tips: నేటి కాలంలో కొత్త మొబైల్, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి బదులుగా రీఫర్బిష్డ్ (సెకండ్ హ్యాండ్) గ్యాడ్జెట్‌లను కొనుగోలు చేసే ఒక వర్గం ఇప్పటికీ భారతదేశంలో ఉంది. సెకండ్ హ్యాండ్ గ్యాడ్జెట్‌లు సాధారణంగా కొత్త గ్యాడ్జెట్‌ల కంటే తక్కువ ధరకు లభిస్తాయి. డబ్బు ఆదా చేయడానికి కూడా ప్రజలు వాటిని కొనుగోలు చేస్తారు. వాటిని కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత కాలం తర్వాత ఆ గ్యాడ్జెట్లు సరిగా పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి మీరు కొన్ని ప్రత్యేక విషయాలను దృష్టిలో ఉంచుకుని సెకండ్ హ్యాండ్ గ్యాడ్జెట్‌లను కొనుగోలు చేయాలి. ఈ విషయాలను పాటించడం ద్వారా కొనుగోలు చేస్తే మీ చేతికి మంచి ప్రొడక్ట్ వస్తుంది.


వారంటీ, రిటర్న్ పాలసీని చెక్ చేయాలి
మీరు రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే ముందుగా దాని వారంటీ, రిటర్న్ పాలసీని తనిఖీ చేయాలి. రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌ను అధికారిక వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేసే ముందు మీరు దానిపై కనీసం 6 నెలల వారంటీని పొందుతారని నిర్ధారించుకోండి. మరోవైపు రిటర్న్ పాలసీని కూడా చెక్ చేయండి. తద్వారా మీరు భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌లో ఏదైనా సమస్య వస్తే రిటర్న్ చేయవచ్చు.


ట్రస్టెడ్ సెల్లర్ నుంచి కొనాలి
పునరుద్ధరించిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మీరు కొనుగోలు చేస్తున్న సెల్లర్ లేదా కంపెనీ గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. మీరు సెల్లర్ లేదా కంపెనీ రివ్యూలు, రేటింగ్‌లను కూడా చెక్ చేయాలి. మీరు మంచి ప్లాట్‌ఫాం నుంచి కొనుగోలు చేస్తే మంచి ధర, మంచి కండీషన్‌లో ఉన్న రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!


గ్రేడింగ్ కూడా ముఖ్యమే...
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌ల గ్రేడింగ్ (గ్రేడ్ A, B, C) రూపంలో ఉంటుంది. వీటిలో గ్రేడ్ ఏ అన్నిటి కంటే ఉత్తమమైనది. మీరు గ్రేడ్ ఏ రేటింగ్ ఉన్న ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే అది బాగా పని చేస్తుంది.


ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ చూసుకోవాలి...
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు దాని బ్యాటరీపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ ఎంత అనేది చూసుకోవాలి. తక్కువ బ్యాటరీ లైఫ్‌తో రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయకూడదు.


కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసేటప్పుడు దానిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్‌ను క్షుణ్ణంగా చెక్ చేయాలి. ఎక్స్‌టెండెడ్ వారంటీ యాంటీ వైరస్ సబ్‌స్క్రిప్షన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోండి.


మీరు రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనేలా ఉంటే దాని బ్రాండ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి బ్రాండ్లకు చెందిన ల్యాప్‌టాప్‌ల్లో క్వాలిటీ కాంపోనెంట్స్ వాడతారు. దీని కారణంగా ఆ డివైస్ జీవితకాలం మరింత పెరుగుతుంది. మీరు పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుంది.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!