iMac 24 inch 2024 Price in India: యాపిల్ 24 అంగుళాల ఐమ్యాక్‌కు సంబంధించిన రిఫ్రెష్డ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇందులో కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ 3ఎన్ఎం ఎం4 చిప్‌ను అందించారు. 4.5కే రెటీనా డిస్‌ప్లే కూడా ఉంది. టచ్ ఐడీ, మ్యాజిక్ హౌస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్న మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్ కూడా ఉన్నాయి. కొత్త 24 అంగుళాల ఐమ్యాక్... లేటెస్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు ఇప్పటికే అమెరికాలో కంపాటిబుల్ డివైసెస్‌కు రోల్ అవుట్ అవ్వడం మొదలైంది.


ఐమ్యాక్ 24 అంగుళాల మోడల్ (2024) ధర
24 అంగుళాల ఐమ్యాక్ ధర రూ.1,34,900 నుంచి ప్రారంభం కానుంది. దీని బేస్ మోడల్లో 8 కోర్ సీపీయూ, 8 కోర్ జీపీయూ, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండనుంది. బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, పర్పుల్, సిల్వర్, ఎల్లో కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 8వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.


10 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూ ఉన్న 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,54,900గానూ, 10 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూ ఉన్న 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,74,900గానూ, 10 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూ ఉన్న 24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,94,900గానూ నిర్ణయించారు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఐమ్యాక్ 24 అంగుళాల మోడల్ (2024) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐమ్యాక్ 24 అంగుళాల మోడల్లో 4.5కే రెటీనా డిస్‌ప్లేను అందించారు. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది సపోర్ట్ చేయనుది. నానో టెక్చర్ మాట్ గ్లాస్ ఫినిష్‌తో ఈ డిస్‌ప్లే రానుందని యాపిల్ తెలిపింది. డిస్‌ప్లేకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అటాచ్ అయి ఉంటుంది. 1080పీ వీడియో రికార్డింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


యాపిల్ ఈ ఐమ్యాక్‌లో లేటెస్ట్ 3 ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీ ఉన్న ఎం4 చిప్‌ను అందించారు. 32 జీబీ వరకు ర్యామ్, 2 టీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఎం4 చిప్‌లో ఉన్న 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ద్వారా యాపిల్ ఇంటెలిజెన్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇది పలువురు యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.


వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.3, నాలుగు థండర్ బోల్ట్ 4, యూఎస్‌బీ 4 పోర్టులు ఉండనున్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. గిగాబిట్ ఎథర్‌నెట్ పోర్టు కూడా ఇందులో చూడవచ్చు. టచ్ ఐడీ ఉన్న యాపిల్ లేటెస్ట్ మ్యాజిక్ కీబోర్డు, మ్యాజిక్ మౌస్, మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్ యాక్సెసరీస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఐమ్యాక్‌లో 6 స్పీకర్ సెటప్ అందుబాటులో ఉంది. డాల్బీ అట్మాస్ కంటెంట్‌తో స్పేషియల్ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఐమ్యాక్ కొత్త మోడల్ మందం 147 మిల్లీమీటర్లు కాగా, బరువు 4.44 కేజీలుగా ఉంది.



Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే