New YouTube features : న్యూ ఫీచర్స్​తో యూట్యూబ్.. ఈ మార్పులు, చేర్పుల గురించి తెలుసా? కేవలం వారికి మాత్రమేనా?

YouTube Features : మీరు యూట్యూబ్ ఎక్కువగా చూస్తారా? అయితే ఇప్పుడు ఇది సరికొత్త మార్పులు చేర్పులతో వచ్చేసిందట. ఇంతకీ ఆ మార్పులు ఏంటో.. కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

YouTube Premium Features : యూట్యూబ్​ని చూసేవాళ్లు చాలామందే ఉంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ఎందుకంటే.. ఇన్​స్టాగ్రామ్ లేని వాళ్లు, చాలామంది మహిళలు YouTube​ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. గతంలో వీడియోలతో అలరించిన యూట్యూబ్ అప్ డేట్ అయి షార్ట్స్​ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంతో యూట్యూబ్​ని చూసేవారి సంఖ్య భారీగానే ఉంది. అయితే ఈ నేపథ్యంలో యూట్యూబ్​ని యూజర్స్​ ఫ్రెండ్లీగా మార్చేందుకు న్యూ ఫీచర్స్​తో వచ్చారు. 

Continues below advertisement

న్యూ ఫీచర్లు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్ది వీడియో స్ట్రీమింగ్ కోసం YouTubeని ఆశ్రయిస్తున్నారు. కొందరికి ఇదే Income Source కూడా. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అలా తాజాగా యూట్యూబ్​లో ఇప్పుడు ఆడియో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తూ.. మొబైల్​లో వేగవంతంగా ప్లే బ్యాక్ చేయడం, షార్ట్​లో పిక్చర్ ఇన్ పిక్చర్​ మోడ్ వంటి న్యూ ఫీచర్​లను అందుబాటులోకి తెస్తోంది. అయితే వీటిని ప్రస్తుతం YouTube Premium యూజర్స్​కి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా? లేదా ఫ్యూచర్​లో తెలుస్తుంది. 

ఈ ప్రయోగాత్మక ఫీచర్​లను YouTube ప్రీమియం వినియోగదారుల కోసం.. ప్రయోగాత్మకంగా పరిచయం చేస్తుంది. అలాగే Google One ప్రీమియం ప్లాన్ ద్వారా వీటి సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ప్రీమియం సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్స్.. ప్రీయమం లేనివారికి అందుబాటులోకి వస్తాయా? రాదా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం ఇవ్వలేదు. 

ప్రీమియంతో 4x 

ప్రీమియం సబ్​స్క్రైబర్​లు ఇప్పుడు 256kbps బిట్​రేట్​తో మ్యూజిక్ వీడియోలను వినవచ్చని YouTube తెలిపింది. YouTube Music 'హై' ఆడియో నాణ్యత కూడా అదే బిట్‌రేట్‌ను అందిస్తుంది. అలాగే యాప్ వీడియో ప్లేబ్యాక్​ ఎంపికను కూడా వేగవంతం చేసేలా న్యూ ఫీచర్ అప్​డేట్ చేశారు. దీనివల్ల 4x వేగంతో వీడియోలను చూసే అవకాశమంది. ఇప్పటివరకు ప్లేబ్యాక్ కేవలం 2x వేగంతో చూసే వెసులుబాటు కలిగించింది. అయితే ఇది ప్రీమియం లేనివారికి కూడా అందుబాటులో ఉంది. ప్రీమియం తీసుకుంటే 4x వేగంతో చూడొచ్చు.

జంప్ ఎహెడ్

2024లో YouTube యాప్ "జంప్ ఎహెడ్" అనే కొత్త ఫీచర్​ను మొబైల్​కి తీసుకొచ్చింది. పేరుకు తగ్గట్లుగానే.. టైమ్​స్టాంప్​లను నిర్ణయించడానికి మెషిన్ లెర్నీంగ్​తో కలిసి.. ప్లాట్​ఫారమ్​తో వీడియోలోని ఉత్తమ భాగాన్ని చూసేలా ఈ ఫీచర్​ను తెచ్చారు. ఇప్పుడు జంప్ ఎహెడ్ ఫీచర్​ వెబ్​లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే వెబ్​లో జంప్ ఎహెచ్ ఫీచర్​ ఉపయోగించాలంటే ఫిబ్రవరి 5 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

యాప్ iOS వెర్షన్‌లో షార్ట్‌ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను YouTube అందిస్తుంది. షార్ట్-ఫారమ్ కంటెంట్ అయిన షార్ట్​లను YouTube వినియోగదారులు స్మార్ట్ డౌన్‌లోడ్‌లను ఆన్ చేయవచ్చు. Android వెర్షన్‌లో ఈ రెండు ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. YouTube Shorts పిక్చర్-ఇన్-పిక్చర్, Shorts స్మార్ట్ డౌన్‌లోడ్‌లు ఫిబ్రవరి 19 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. 

Also Read : వాట్సాప్​లో త్వరలో న్యూ అప్​డేట్.. ఇకపై స్టేటస్​ను నేరుగా ఫేస్​బుక్, ఇన్​స్టాలో షేర్ చేసుకోవచ్చట

Continues below advertisement