WhatsApp Status Sharing : సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవారికి ఓ గుడ్ న్యూస్. ఇకపై మీరు వాట్సాప్‌లో షేర్ చేసే స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయొచ్చు. అయితే ఈ అప్డేట్ రావడానికి మరికొద్ది టైమ్ పడుతుందట. ఈ అప్డేట్ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పరియడం చేయనున్నట్లు వాట్సాప్ చెప్తోంది. అసలు ఈ కొత్త అప్డేట్ ఏంటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్‌ఫారమ్ యాప్స్‌లలో వాట్సాప్ స్టేటస్‌లను ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునే సౌలభ్యం తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌లో షేర్ చేసిన స్టేటస్‌ను ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్నట్లు.. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఒకేసారి లాగిన్ అవ్వొచ్చు..
ఒకటే సైన్ ఆన్‌తో వివిధ మెటా యాప్‌లకు లాగిన్ చేయడాన్ని సులభతరం చేయడంతో పాటు.. వేగంగా సమాచారాన్ని పోస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు తెలిపారు. అలాగే వాట్సాప్.. సోషల్ మీడియా యాప్‌లలో మరిన్ని యూనివర్సల్ ఫీచర్‌లను పరిచయం చేయనున్నట్లు, రోల్అవుట్ తర్వాత మరిన్ని మార్పులను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది.
షేరింగ్ వద్దనుకుంటే..
రానున్న నెలల్లో మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఐడీల నుంచి వాట్సాప్‌ను జోడించే వీలును తీసుకురానుంది. అయితే ఇది కావాలనుకునేవారు చేసుకోవచ్చు. లేదంటే ఇగ్నోర్ చేయవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగతమని తెలిపింది. యూజర్స్ ఇప్పటికీ తమ వాట్సాప్ నుంచి ఇతర యాప్స్‌కు షేర్ చేయవద్దనుకుంటే ఆ ఆప్షన్‌ను సెలక్ట్ చేయకుంటే సరిపోతుందని తెలిపింది. నేరుగా వాట్సాప్ నుంచి Facebook, Instagram స్టోరీలను అప్డేట్ చేయాలనుకుంటే ఈ ఫీచర్‌కు యాక్సెస్ ఇస్తే సరిపోతుందట. దీనివల్ల ఒకటే సమాచారాన్ని ఎక్కువ సార్లు పోస్ట్ చేయాల్సిన అవసరముండదు. ఈజీగా పనైపోతుంది. ఇన్ఫ్లూయెన్సర్లకు, యూట్యూబర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉండనుంది.
వాట్సాప్ ఇంటిగ్రేషన్
త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ అప్డేట్ను తీసుకురానున్నారు. అయితే రోల్ అవుట్ పద్ధతిలో దశలవారీగా ఇది వచ్చే అవకాశముంది. ఆప్షన్ అందుబాటులోకి వస్తే యూజర్స్ WhatsApp సెట్టింగ్‌లలో దీనిని చూస్తారు. అనంతరం అకౌంట్స్ సెంటర్ ఇంటిగ్రేషన్ మూడు యాప్‌ల కోసం ఒకే సైన్ఆన్ని తీసుకువస్తుంది. దీనివల్ల వల్ల యూజర్స్ తక్కువ సమయంలో రీ లాగిన్ అయ్యే వెసులుబాటు ఇస్తుంది. దీనివల్ల యాప్‌లలో ఒకేసారి అవతార్లు, AI స్టిక్కర్‌లు, ఇమాజిన్ మి క్రియేషన్‌లను నిర్వహించగల సామర్థ్యంతో కూడినన కొత్త ఫీచర్‌లను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రైవసీ ఉంటుందా?
మెటా ప్లాట్‌ఫారమ్‌లను ఇలా వాట్సాప్‌తో కనెక్ట్ చేస్తే.. ప్రైవసీ పరిస్థితి ఏంటి అనే డౌట్ అందరికీ వస్తుంది. ఈ విషయంపై కూడా వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. WhatsApp అకౌంట్, Meta ప్లాట్‌ఫారమ్‌ల అకౌంట్లను కనెక్ట్ చేసినా.. వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సేఫ్‌గా ఉంటాయని తెలిపింది. వేరే యాప్స్ కూడా ఈ డేటాను చదవలేవని తెలిపింది.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్డేట్ కూడా