Road Accident : కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరంతా సావనూర్ నుంచి కుంత మార్కెట్‌కు కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ ఉత్తర కన్నడ జిల్లా సవనూరు నుంచి కుమటకు వెళ్తున్నట్లు సమాచారం.
మృతులు సవనూరు తాలూకాకు చెందినవారని, లారీలో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై యల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అంతకుముందు జనవరి 21న అర్థరాత్రి కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివతో సహా ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందిరు. విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరగ్గా.. సింధనూరు సమీపంలో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులకు గాయాలు కాగా.. వారిని సింధనూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.