రిలయన్స్ జియో తన వినియోగదారులకు 21 జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది. 2023 సెప్టెంబర్ 5వ తేదీన జియో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే జియో రాకతో మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు కొన్ని ప్లాన్ల ద్వారా ఉచిత డేటాను అందిస్తుంది.


కేవలం బోనస్ డేటా మాత్రమే కాకుండా అజియో, నెట్‌మెడ్స్ వంటి వాటికి డిస్కౌంట్ కూపన్లు కూడా లభిస్తున్నాయి. రూ.299, రూ.749, రూ.2,999 ప్లాన్ల ద్వారా రీఛార్జ్ చేస్తే అదనపు డేటా లాభాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ కూడా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య అందుబాటులో ఉండనున్నాయి.


రూ.299 ప్లాన్
వీటిలో రూ. 299 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించనున్నాయి. జియో ఫ్రీ డేటా ప్లాన్ కింద 7 జీబీ డేటా ఉచితంగా లభించనుంది.


రూ.749 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీని లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా 14 జీబీ డేటా ఉచితంగా లభించనుంది. రెండు 7 జీబీ వోచర్లు లభించనున్నాయి. మై జియో యాప్‌లో ఈ వోచర్లు తీసుకోవచ్చు.


రూ.2,999 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించనుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందించనున్నారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 21 జీబీ డేటా ఉచితంగా లభించనుంది. దీంతో పాటు మరిన్ని ఇతర లాభాలు కూడా లభించనున్నాయి.


మరోవైపు రిలయన్స్ జియో ఇటీవలే కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే జియో భారత్ వీ2 4జీ. ప్రస్తుతం 2జీ మొబైల్ ఉపయోగిస్తున్న 25 కోట్ల మంది వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చినట్లు జియో తెలిపింది. ఈ ఫీచర్ ఫోన్లకు ప్రత్యేకమైన ప్లాన్లు కూడా ప్రకటించింది. జియో భారత్ వీ2 4జీ ధరను రూ.999గా నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ ఫీచర్ ఉన్న ఫోన్లలో అత్యంత చవకైనది ఇదే. రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


ఈ ఫోన్‌లో 1.77 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. జియో సినిమా, జియో సావన్, జియో పే సర్వీసులను జియో భారత్ వీ2 4జీ ద్వారా ఉపయోగించవచ్చు. దీని వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ వీజీఏ కెమెరా ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను జియో భారత్ వీ2 4జీ అందించనుంది. స్టోరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు కార్బన్ లోగోను కూడా చూడవచ్చు. 


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial