Ayesha Meera Case :  ఆంధ్రప్రదేశ్ లో పదిహేనేళ్ల క్రితం హత్యకు గురైన  అయేషా మీరా హత్య కేసులో సిబిఐ క్యాంపు కార్యాలయంలో సాక్షుల విచారణ జరిగింది.   అయేషా మీరా కేసు న్యాయవాది, సాక్షి వెంకట క్రిష్ణ సీబీఐ విచారణకు హాజరయ్యారు.  హత్య జరిగిన తరువాత ఏ టైంకు తాను హాజరు అయ్యానో సీబిఐ అధికారులు అడిగారని వెంకటక్రిష్ణ తెలిపారు.  ఆయేషా మీరా హత్య జరిగిన తరువాత తానే స్వయంగా ఇంక్వేస్ట్ రిపోర్ట్ రాశాననని తెలిపారు.  మృతదేహంపై గాయాలు ఉన్నాయా అని సీబిఐ అధికారులు అడిగారన్నారు.  అప్పటి అధికారులు  తెలుసా అని అడిగారన్నారు.  ఆయేషా మీరా కుటుంబ సభ్యులతో తనకు ఉన్న  ఉన్న పరిచయాల గురించి అడిగారని తెలిపారు.             

  


ఈ కేసులో నిధితులను అరెస్టు చేయాలని విచారణకు వచ్చిన ప్రతిసారీ అడుగుతున్నానని. విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అరెస్ట్ చేసిన పరిస్థితులు లేవన్నారు సాక్షి వెంకట క్రిష్ట.   హత్య జరిగి 15 యేళ్లు అవుతుంది మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సీబీఐ అధికారులు న్యాయం చేస్తారని తాము భావిస్తున్నామని వ్యాక్యానించారు.                           


27 డిసెంబరు 2007 న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో   ఆయేషా మీరా  హత్యకు గురయింది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తన ప్రేమను కాదన్నందుకే హత్య చేశానని ఓ వ్యక్తి రాసిన లేఖ అక్కడ కనిపించింది. అదెవరు అన్నది ఇంత వరకూ తేలలేదు.  విచారణలో పలువురిని నిందితులుగా చేర్చేంచుకు పోలీసులు ప్రయత్నించారు కానీ ఎవరిపైనా ఆధారాలు చూపించలేకపోయారు. చివరికి చాలా కేసుల్లో నిందితునిగా ఉన్న సత్యంబాబే హత్య చేశాడని చెబుతూ 2008లో అరెస్ట్ చేశారు.              


29 సెప్టెంబరు 2010న విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 302 సెక్షను క్రింద 14 ఏళ్ళ జైలు శిక్ష, మానభంగానికి గాను 376 సెక్షను క్రింద 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అదే ఏడాది అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబు ను నిర్దోషిగా ప్రకటించినది. తర్వాత మరోసారి సీబీఐ విచారణకు ఆదేశించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నాశనం కావడంతో..  సీబీఐ అధికారులు కూడా పెద్దగా ముందడుగు వేయలేకపోతున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సీబీఐ అధికారులు ఆయేష మీరా సమాధిని తవ్వించి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు.  సాక్షుల విచారణను సీబీఐ పూర్తి చేసింది. నేరస్తులెవరో ఇంత వరకూ గుర్తించలేదని తెలుస్తోంది.