ఐఫోన్ 14 ప్రోలో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను యాపిల్ అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. తాజాగా లీకైన వివరాల ప్రకారం ఐఫోన్ 14 ప్రోలో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
యాపిల్ తన ఐఫోన్ల కోసం 48 మెగాపిక్సెల్ కెమెరాలను రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ల్లో 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ కెమెరాలు అందిస్తున్నారు. అయితే యాపిల్ తన 14 ప్రో సిరీస్ కోసం కొత్తగా సెన్సార్లను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
యాపిల్ త్వరలో తన ప్రో ఫోన్లలో 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా అందించే అవకాశం ఉంది. అయితే మనకు కావాల్సిన రిజల్యూషన్‌ను మనం ఎంచుకోవచ్చు. పొర్‌ట్రెయిట్ లేదా ల్యాండ్ స్కేప్ ఫొటోలు ఎక్కువ మెగాపిక్సెల్స్‌ను ఉపయోగించుకుంటాయి.
లో టైల్ ఫొటో అయితే 12 మెగాపిక్సెల్ వరకు పిక్సెల్ బిన్నింగ్ అవుతుంది. ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో కూడా ఐఫోన్ 14 ప్రోలో 48 మెగాపిక్సెల్ కెమెరాలను అందిస్తారని తెలిపారు. 2023లో వచ్చే ఐఫోన్లలో పెరిస్కోప్ జూమ్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 14లో నాచ్ కాకుండా పంచ్ హోల్ కెమెరా ఉండనుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో పిల్ ఆకారంలో ఉండే పంచ్ హోల్ డిజైన్‌ను అందించనున్నారా లేదా అన్న సంగతి తెలియరాలేదు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!