త్యంత భద్రతతో కూడిన బ్యాటరీలతో వచ్చినా స్మార్ట్ ఫోన్లు కూడా అప్పుడప్పుడు పేలిపోవడం గమనిస్తుంటాం. గతంలో నోకియా బ్యాటరీలు పేలడం సంచలనం  కలిగించింది. ప్రస్తుతం ఆయా రకాల కంపెనీ ఫోన్లు సైతం అప్పుడప్పుడు కాలిపోతున్నాయి. అయితే,  ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? కారణాలు ఏంటి? ఒకవేళ ఫోన్లు పేలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫోన్లు ఎందుకు పేలుతాయి?


ఫోన్  పేలడానికి చాలా కారణాలుంటాయి. దీనికి కారణం బ్యాటరీ.  ఆధునిక హ్యాండ్‌సెట్‌లు లిథియం అయాన్ బ్యాటరీలతో అమర్చబడి ఉంటాయి. ఇవి సానుకూల,  ప్రతికూల ఎలక్ట్రోడ్‌ల కు సంబంధించి కచ్చితమైన సమతుల్యతను కలిగి ఉంటాయి . బ్యాటరీ లోపల ఉండే భాగాలు ఏదైనా సమస్యలకు గురైతే పేలుడుకు దారితీసే అవకాశం ఉంది.  


బ్యాటరీలు ఎలా పాడవుతాయి?


అనేక కారణాల వల్ల బ్యాటరీలు పాడవుతాయి. ఎక్కువగా అధిక వేడి కారణంగా చెడిపోతాయి.  ఛార్జింగ్ బ్యాటరీ, ఓవర్‌వర్క్డ్ ప్రాసెసర్ చాలా త్వరగా వేడిగా మారితే బ్యాటరీలో సమస్య వస్తుంది. ,   థర్మల్ రన్‌ అవే అని పిలువబడే చైన్ రియాక్షన్ మూలంగా బ్యాటరీ మరింత ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఫోన్ పేలిపోతుంది.   


ఫోన్ దెబ్బతినడానికి ఇతర కారణాలు


మీ ఫోన్ వేడెక్కడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫోన్‌ను ఎక్కువ సేపు ఎండలో ఉంచడం, మాల్వేర్ CPUని ఎక్కువగా పని చేయించడం ,గంటల తరబడి ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మూలంగా డివైజ్ లోపల షార్ట్ సర్క్యూట్‌ జరిగే అవకాశం ఉంటుంది.  ఎక్కువ కాలం వాడిన ఫోన్లు సైతం అంతర్గతంగా చెడిపోయే అవకాశం ఉంటుంది.  దీని మూలంగా బ్యాటరీ ఉబ్బండంతో పాటు వేడికి గురవడం జరుగుతుంది. కొన్నిసార్లు కంపెనీ నుంచే సమస్యలతో వచ్చే అవకాశం ఉంది.


ఫోన్లు పేలిపోయే ముందు వచ్చే హెచ్చరికలు


ఫోన్ పేలిపోయే ముందు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. హిస్సింగ్  లేదంటే పాపింగ్ శబ్దాలు వస్తాయి. అదీ కాదంటే, ప్లాస్టిక్ రసాయనాలు మండుతున్న వాసన  వస్తుంది. ఈ సూచనలు ఫోన్ లు పేలిపోయే అవకాశాన్ని సూచిస్తాయి. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే పేలిపోవచ్చు.  ఉబ్బిన బ్యాటరీ కూడా ఒక పెద్ద హెచ్చరికగా భావించవచ్చు. ఎందుకంటే, అది ఇంటర్నల్ గా దెబ్బతిన్నప్పుడు మాత్రమే అలా తయారవుతుంది.   


ఫోన్ పేలకుండా ఆపవచ్చా?


కంపెనీ నుంచి వచ్చిన తప్పు అయితే వినియోగదారులు ఏమీ చేయలేరు. కానీ, మీ ఫోన్ బ్యాటరీపై పెట్టే కొంత లోడ్‌ను తగ్గించడానికి చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. భౌతిక నష్టాన్ని నివారించడానికి ఫోన్ కేస్‌ని ఉపయోగించడం మంచిది. విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి ఫోన్ ను దూరంగా ఉంచాలి. మీరు నిద్రించే ప్రదేశంలో ఫోన్‌ ను ఛార్జింగ్ చేయడం మానేయాలి.  మీ ఫోన్‌ లో 30 నుంచి 80 శాతం బ్యాటరీ లైఫ్ మధ్య ఛార్జ్ చేయడం ఉత్తమం. కంపెనీ సిఫార్సు చేసిన ఛార్జర్‌ లు మాత్రమే వాడాలి. 


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?