దేశీయ మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ కారు విడుదల అయ్యింది. ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌ పేరుతో విడుదల అయ్యింది. దీని ధర రూ. 88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయింది. ఇండియన్ మార్కెట్లోకి కేవలం 50 యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త SUV ని కేవలం 50 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ కారులోని ఫీచర్లు, ధర, డిజైన్, ఇంజన్ ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం.


వాస్తవానికి, Audi కంపెనీ గతంలోనే Q7 SUVని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అందులో అందించినట్లుగానే పవర్ అవుట్‌ పుట్, పీక్ టార్క్..  కొత్తగా విడుదలైన లిమిటెడ్ ఎడిషన్‌ లో  ఉన్నాయి. ఇందులో  48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ తో 3.0L V6 TFSI పెట్రోల్ ఇంజన్‌ ను  ఏర్పాటు చేశారు. ఈ కారు 335 bhp కంబైన్డ్ పవర్ అవుట్‌ పుట్, 500 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.  Q7 లిమిటెడ్ ఎడిషన్ గరిష్ఠంగా గంటకు 250 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్ రోడ్, ఆల్ రోడ్, ఇండివిడ్యువల్ అనే ఏడు డ్రైవ్ మోడ్స్‌ లో పని చేస్తుంది. 


ధర ఎంత? డిజైన్ ఎలా ఉందంటే?


Audi Q7 లిమిటెడ్ ఎడిషన్‌ ధరను  రూ.88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా  కంపెనీ నిర్ణయించింది. దీనిలోని ఫ్లాట్ సింగిల్ ఫ్రేమ్ గ్రిల్‌ ఆక్టాగోనల్ అవుట్‌ లైన్‌, కొత్త సిల్ ట్రిమ్‌ తో వస్తుంది.  19-అంగుళాల 5-ఆర్మ్ స్టార్ స్టైల్ డిజైన్ అల్లాయ్ వీల్స్‌, హై-గ్లోస్ స్టైలింగ్ ప్యాకేజీ, ఇంటిగ్రేటెడ్ వాషర్ నాజిల్‌, రన్నింగ్ బోర్డ్‌ లు, క్వాట్రో ఎంట్రీ LED, సిల్వర్‌ ఆడి రింగ్ ఫాయిల్, అడాప్టివ్ విండ్‌షీల్డ్ వైపర్స్‌ వినియోగదారులను చాలా ఆకట్టుకుంటున్నాయి. కారు క్యాబిన్‌ డిజిటల్ ఆపరేటింగ్ కాన్సెప్ట్‌ తో డ్రైవర్ ఓరియంటెడ్ ర్యా ప్‌రౌండ్ కాక్‌పిట్ డిజైన్‌ ను కలిగి  ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు బారిక్యూ బ్రౌన్ అనే ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్ లో రిలీజ్ అయ్యాయి.


ఈ కారు స్పెసిఫికేషన్లు


ఈ సరికొత్త కారు పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవర్-సైడ్ మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, అడ్జస్టబుల్ ఫోర్, ఆఫ్ట్ పొజిషన్,  రిక్లైన్‌ తో సెకండ్ రో సీట్లు, 30 కలర్స్‌తో యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్, ఆడి వర్చువల్ కాక్‌పిట్  సహా పలు మియం ఫీచర్లు ఉన్నాయి. కారు క్యాబిన్‌ లో 2 పెద్ద టచ్‌ స్క్రీన్ సిస్టమ్స్‌ ఇచ్చారు. MMI నావిగేషన్ ప్లస్, MMI టచ్ రెస్పాన్స్‌తో 10.1-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇందులో  ఎలక్ట్రికల్‌ ఫోల్డబుల్ థర్డ్ రో సీట్లు, ఆడి స్మార్ట్‌ ఫోన్ ఇంటర్‌ఫేస్, 19 స్పీకర్లతో  సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌, 4-జోన్ ఎయిర్ కండీషనర్ కోసం 8.6-అంగుళాల MMI టచ్ కంట్రోల్ ప్యానెల్ ను అందిస్తున్నారు. ఈ కారులో సేఫ్టీ కోసం 8 ఎయిర్‌ బ్యాగ్స్‌, స్పీడ్ లిమిటర్‌తో క్రూజ్ కంట్రోల్, 360° కెమెరాతో పార్క్ అసిస్ట్ ప్లస్ సహా పలు అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లను ఈ కారు కలిగి ఉంది.


Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే!
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి