Disney Follows Netflix: డిస్నీ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మార్గాన్ని ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు మీరు డిస్నీ పాస్‌వర్డ్‌ను ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా జరగదు. నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ కూడా తన విధానాన్ని మార్చుకుంది.
 
ఈ ఏడాది జూలైలో నెట్‌ఫ్లిక్స్ భారతీయ వినియోగదారులు తమ ఇంటి వెలుపల వ్యక్తులతో పాస్‌వర్డ్‌లను షేర్ చేయకుండా నిషేధించింది. ఇప్పుడు డిస్నీ కూడా నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది. డిస్నీ+ కెనడాలోని వినియోగదారులను వారి ఇంటి వెలుపల వారితో తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేయవద్దని కోరింది. డిస్నీప్లస్ వినియోగదారుల కోసం పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది.


నవంబర్ 1వ తేదీ నుంచి కెనడాలోని వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను వారి ఇంటి వెలుపలి వ్యక్తులతో షేర్ చేయలేరు. డిస్నీప్లస్ ఈ సమాచారాన్ని తన కస్టమర్‌లకు ఈమెయిల్ ద్వారా అందించింది. ఈ మెయిల్‌లో "మీ ఇంటి వెలుపల మీ ఖాతా లేదా లాగిన్ క్రెడెన్షియల్స్‌ను షేర్ చేయడాన్ని లిమిట్ చేస్తున్నాం." అని పేర్కొన్నారు. ఇది కాకుండా కంపెనీ అప్‌డేట్ చేసిన హెల్ప్ సెంటర్‌లో "మీరు మీ ఇంటి వెలుపలి వ్యక్తులతో మీ సబ్‌స్క్రిప్షన్‌ను షేర్ చేయలేరు" అని కూడా ఉంది.


దీన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది?
వినియోగదారుల ఖాతాలను ప్రస్తుతం లిమిట్ చేస్తున్నారు. దీని కోసం వారి ఖాతాను అనలైజ్ చేస్తామని కంపెనీ తెలిపింది. యూజర్లు ఈ నిబంధనలను పాటించడం లేదని కంపెనీ భావిస్తే, అతని ఖాతా రద్దు అవుతుంది.


భారతదేశంలో ఎలా?
ప్రస్తుతం కెనడాలో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. భారతదేశంలో దీని అమలు గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ డిస్నీ త్వరలో ఇతర దేశాలలో కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేస్తుందని గట్టిగా వార్తలు వస్తున్నాయి.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial