Rainbow Childrens Heart Institute in Hyderabad: 

ఆర్ధిక స్థోమత లేని గర్భస్థ చిన్నారుల హృద్రోగ చికిత్స కోసం ఆర్ సి హెచ్ ఐ కి చేయుత అందించనున్న లారస్ లాబ్స్

హైదరాబాద్, 29 సెప్టెంబర్ 2023: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రెయిన్బో హాస్పిటల్ గ్రూప్లో పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ కోసం ప్రత్యేకమైన కేంద్రం అయిన రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, పుట్టుకతో వచ్చే గుండె లోపాలపై విజయం సాధించిన లిటిల్ ఛాంపియన్స్ తో కలిసి వేడుక జరుపుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ 110 పడకల ఇన్స్టిట్యూట్, సంవత్సరానికి సుమారు 700 కార్డియాక్ ప్రొసీజర్స్, 750 కు పైగా కార్డియాక్ సర్జరీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతూ విదేశాల నుంచి వస్తోన్న వందలాది మంది పిల్లల జీవితాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.


ఎంతో ముఖ్యమైన ‘వరల్డ్ హార్ట్ డే’ పురస్కరించుకుని, రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన, గర్భంలో ఉండగానే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడి విజయవంతంగా చికిత్స పొందిన 30 మందికి పైగా చిన్నారులతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆసక్తికరంగా మరో 20 మంది సర్వైవర్స్ కూడా వర్ట్యువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   


ఈ సందర్భంగా.. చిట్టి హృదయాలను రక్షించడంలో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి అవసరమైన మద్దతు ఇస్తామని లారస్ ల్యాబ్స్ ప్రతిజ్ఞ చేసింది. సంవత్సరానికి 50 సర్జరీలకు తమ మద్దతును అందిస్తామని లారస్ ల్యాబ్స్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ వి వి రవి కుమార్ ప్రకటించారు.


పీడియాట్రిక్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్వేతా బఖ్రు మాట్లాడుతూ.. " ఈ లిటిల్ ఛాంపియన్స్ తో కలిసి వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు, నిర్మాణాత్మక లోపం అని గుర్తించటం అవసరం, పిండ దశలోనే ఈ సమస్యను గుర్తించడం అత్యంత కీలకం. పిండ దశలోని శిశువు ప్రాణాలను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పిండం దశలోనే గుర్తించబడిన కొన్ని గుండె జబ్బులకి, దీర్ఘకాలిక ఫాలో-అప్లు మినహా వైద్య లేదా శస్త్రచికిత్స జోక్యం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో, శిశువు గర్భంలో ఉండగానే చికిత్స చేయవచ్చు. కాబట్టి, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు కలిగి ఉన్న శిశువుల తల్లిదండ్రులు ఆశను కోల్పోవద్దని , ఈ సవాలుపై పోరాడి గెలిచి విజయవంతంగా కోలుకోవడానికి తమ బిడ్డలకి తోడ్పాటు అందించాలి.


రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో మేం పిల్లల జీవితాలను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తుంటాము. మేము ప్రతి నెలా సుమారు 200కు పైగా ఫిటెల్ ఎకో - కార్డియోగ్రఫీలు నిర్వహిస్తుంటాము. అంటే సంవత్సరానికి మొత్తం 2400 కంటే ఎక్కువ ఎకోకార్డియోగ్రామ్లు చేస్తుంటాము. వీటిలో దాదాపు 30% గుండె లోపాలను వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ లోపాలలో చాలా వరకు చికిత్సతో నయం చేయవచ్చని గమనించవలసిన విషయం. ఈ పిల్లలు చక్కటి ఎదుగుదలతో మరియు మంచి ఆరోగ్యంతో వృద్ధి చెందడం చూసి మేము చాలా సంతోషిస్తున్నాము" అని అన్నారు.  


రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ చిన్న స్వామి రెడ్డి మాట్లాడుతూ.. " ప్రాథమిక దశలోనే గుర్తిస్తే , చాలా వరకూ పుట్టుకతో వచ్చే గుండె వైకల్యాలకు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్సలు ప్రాణాలు కాపాడతాయి. ఈ పిల్లలకు విజయవంతంగా చికిత్స చేసి, వారిని చిరునవ్వుతో ఇంటికి పంపినప్పుడు మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ముందస్తు జోక్యం కీలకమని అర్థం చేసుకోవడం చాలా అవసరం. శిశువు గర్బంలో ఉండగానే లోపాన్ని గుర్తించినట్లయితే, అది విజయవంతమైన చికిత్సను సులభతరం చేస్తుంది" అని అన్నారు. 


“చిట్టి హృదయాలను రక్షించడం మరియు మరింత ముందుకు వెళ్తూ పిల్లల జీవితాలను రక్షించడంలో భాగంగా చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది. ఒక ఉదాత్తమైన లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి మాకు ఈ అవకాశాన్ని అందించినందుకు రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అని లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ వి వి రవి కుమార్ అన్నారు. మరిన్ని వివరాలకు డా. కోనేటి నాగేశ్వర రావు: 97013 -00455,  డా. శ్వేతా బఖ్రు: 80089 - 15442 నెంబర్లలో సంప్రదించవచ్చు.