టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ కావడం దుమారం రేపింది. తన సహచర క్రికెటర్‌పై చేసిన వ్యాఖ్యలు యువీని జైలు వరకు తీసుకెళ్లాయి. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఈవెంట్లో కులం పేరుతో యువీ చేసిన వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
యువరాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి హర్యానా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ రావడంతో కొన్ని షరతులతో మాజీ క్రికెటర్ యువరాజ్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. గత ఏడాది షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీకి చెందిన దళిత హక్కుల పోరాటకారుడు రజత్ కల్సాన్ యువీపై ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కేసు హన్సీ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది.
అరెస్టు అయిన వెంటనే హైకోర్టు ఉత్తర్వులతో వెంటనే బెయిల్ వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వచ్చాక యువరాజ్ తన లాయర్లతో కలసి హిసార్ చేరుకున్నాడు. కొన్ని గంటలు విచారించిన అనంతరం తిరిగి చండీఘర్ చేరుకున్నాడు. షెడ్యూల్డ్ కులాలపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద తనపై కేసు నమోదైంది.
యువరాజ్ సింగ్ మొత్తంగా 304 అంతర్జాతీయ వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు, 40 టెస్టు మ్యాచ్‌లు టీమిండియా తరఫున ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించాడు. 2019లో యువీ క్రికెట్ నుంచి పూర్తి స్థాయిలో రిటైరయ్యాడు.
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పుణె వారియర్స్ ఇండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున యువరాజ్ సింగ్ ఆడాడు.
Also Read: ఐపీఎల్ ఫైనల్ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్ గంభీర్
Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?