పెళ్లి సందD సినిమా హీరోయిన్‌ శ్రీలీల తన కూతురు కాదని ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. ఆమె తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. శ్రీలీల తన కూతురు కాదని, తన మాజీ భార్య కూతురని తెలిపారు. తామిద్దరూ విడిపోయి 20 సంవత్సరాలు అవుతుందని, ఆ తర్వాత తన భార్యకు శ్రీలీల పుట్టిందన్నారు. తన ఆస్తుల కోసమే ఇంటర్వ్యూల్లో తన పేరు వాడుతున్నారని పేర్కొన్నారు.


సూరపనేని సంఘంతో మెసేజ్‌లు పెట్టించడంతో పాటు.. తన తండ్రి సూరపనేని వెంకటఅప్పారావు పేరు కూడా వాడుతున్నారన్నారు. సూరపనేని శ్రీలీల తన కూతురు కాదని, ఆ విషయంపై స్పష్టత ఇవ్వడానికే ప్రెస్‌మీట్ పెట్టినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం కారణంగా తాను ఒక కాలేజీని కూడా వదులుకోవాల్సి వచ్చిందన్నారు. తనకు, శ్రీలీలకు అస్సలు సంబంధం లేదన్నారు. సూరపనేని సంక్షేమ సంఘానికి ఇప్పటికే ఈ విషయమై క్లారిటీ ఇచ్చామని, వారి వద్ద నుంచి జవాబు రావాల్సి ఉందన్నారు.


ఈ విషయమై లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామన్నారు. తమ విడాకులపై ఇంకా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు. దీని సూరపనేని సొసైటికి కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. పెళ్లి సందD సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం బాగా వస్తున్నాయని తెలుస్తోంది. హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల ఇద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.


Also Read: బిగ్ బాస్-5.. తల్లి సేఫ్.. కూతురు ఔట్.. ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆమే!


Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా


Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్


Also read: దసరా వేడుకలో పెద్దమ్మతల్లిని దర్శించుకున్న శ్రీముఖి


Also Read: పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...


Also Read: 'జబర్ధస్త్' షో కి జడ్జీగా వస్తానన్న బాలకృష్ణ, నటసింహంతో ఫోన్లో మాట్లాడిన రోజా


Also Read: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి