Tokyo Olympics 2020 Live: సెమీస్‌లో భజరంగ్ పునియా ఓటమి... పతకంపై ఆశలు రేపుతోన్న గోల్ఫర్ అదితి... కాంస్య పోరులో గ్రేట్ బ్రిటన్ చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి
కాంస్య పతకం కోసం భారత్Xగ్రేట్ బ్రిటన్ మధ్య జరిగిన మహిళల హాకీ పోరులో భారత్ ఓడిపోయింది.
భారత అగ్రశ్రేణి రెజ్లర్ భజరంగ్ పునియా సెమీస్‌లో నిరాశపరిచాడు. 65 కిలోల విభాగంలో అలియేవ్‌హాజీ(అజర్‌బైజాన్) చేతిలో 5-12 తేడాతో పునియా ఓటమిపాలయ్యాడు. ఈ ఓటమితో పునియా ఇక కాంస్యం కోసం తలపడనున్నాడు.
క్వార్టర్స్‌లో భజ్‌రంగ్ పునియా... ఇరానీ ఆటగాడు గియాసి చెకా మొర్తజాపై విజయం సాధించి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు. ఫాల్ పద్దతిలో పునియా విజయం సాధించినట్లు అంపైర్ ప్రకటించాడు.
రెజ్లర్ భజ్‌రంగ్ పునియా క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. పురుషుల 65 కేజీల విభాగంలో పునియా కిర్గిస్థాన్ ఆటగాడు ఎర్నాజార్ పై విజయం సాధించాడు.
భారత మహిళల జట్టు కాంస్యం కోసం జరిగిన పోరులో ఓటమి చవి చూసింది. 4-3 తేడాతో ఓడిపోయి నాలుగో స్ధానంతో సరిపెట్టుకుంది.
కాంస్య పోరులో ఇంకా 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. భారత్ ఏదైనా అద్భుతం చేసి గోల్ సాధించి స్కోరు సమం చేస్తుందో లేదో చూడాలి
నాలుగో క్వార్టర్లో గ్రేట్ బ్రిటన్(GB)కి వరుసగా 3 పెనాల్టీ కార్నర్లు ఆడే అవకాశం దక్కింది. మొదటి రెండు అవకాశాల్లో ప్రత్యర్థులను బాగానే అడ్డుకున్న భారత్ చివరి అవకాశంలో విఫలమైంది. దీంతో గ్రేట్ బ్రిటన్ మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత క్రీడాకారిణి ఉదితకు ఎల్లో కార్డు చూపించింది అంపైర్. దీంతో ఆమె మైదానం బయటికి వెళ్లాల్సి వచ్చింది.
మూడో క్వార్టర్ ముగిసే సమయానికి ఇరు జట్లు 3-3తో ముగించాయి
భారత్ తరఫున రెండో క్వార్టర్లో గుర్జీత్ కౌర్, వందన కటారియా గోల్స్ చేశారు.
రెండో క్వార్టర్లో భారత్, గ్రేట్ బ్రిటన్ జట్లు రెండేసి చొప్పున మొత్తం నాలుగు గోల్స్ చేసింది.
పతకం కోసం ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది
Background
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు కాంస్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. కాంస్య పతకం కోసం భారత్Xగ్రేట్ బ్రిటన్ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరాగా తలపడుతున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -