ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టులో కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారు. అసౌకర్యంగా ఉండటంతో బుధవారం జట్టుతో కలిసి సాధన చేయలేదు. మరి గురువారం వారిద్దరూ మ్యాచ్‌ ఆడతారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది!


బుధవారం ఉదయం లేచినప్పటికి నుంచి ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ జ్వరంతో బాధపడ్డారు. స్వల్పంగా ఫ్లూ లక్షణాలూ కనిపించాయి. వెంటనే వారికి కొవిడ్‌ 19 పరీక్షలు చేయించారు. నెగెటివ్‌ రావడంతో శిబిరం ఊపిరి పీల్చుకుంది. వారిద్దరూ కాస్త అసౌకర్యంగా కనిపించడంతో జట్టుతో కలిసి సాధన చేయించలేదు.


దుబాయ్‌ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో సెమీస్‌లో పాకిస్థాన్‌ తలపడుతోంది. ఈ మ్యాచులో విజయం సాధించాలంటే రిజ్వాన్‌, మాలిక్‌ కీలకం. ఎందుకంటే టోర్నీ సాంతం వీరిద్దరూ నిలకడగా రాణించారు. ముఖ్యంగా రిజ్వాన్‌ ఇచ్చిన ఓపెనింగ్‌ భాగస్వామ్యాలతో పాక్‌ భారీ స్కోర్లు ఛేదించింది. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ పతనమైనప్పుడు మిడిలార్డర్లో షోయబ్‌ మాలిక్‌ అండగా ఉంటున్నారు. వికెట్లను అడ్డుకుంటున్నాడు. అంతేకాకుండా అవసరమైనప్పుడు సిక్సర్లు బాదేసి ఆఖర్లో మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తున్నాడు.


ప్రస్తుతం రిజ్వాన్‌, మాలిక్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో బయటకు చెప్పడం లేదు. వారికి ఇంజెక్షన్లు, డ్రిప్స్‌ ఇచ్చి మ్యాచ్‌ ఆడించాలని మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. 'వారిద్దరికీ ఇంజెక్షన్లు, డ్రిప్స్‌ ఇచ్చాక బాగా ఆడతారనడంలో నాకేమీ సందేహం లేదు. ఫ్లూ వారిని ఆపలేదు' అని ఓ వీడియో సందేశాన్ని ట్వీట్‌ చేశాడు.


రిజ్వాన్‌, మాలిక్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని జట్టు మేనేజర్‌ మన్సూర్‌ రాణా అంటున్నాడు. 'ఆ ఇద్దరు ఆటగాళ్లు ఈ రోజు మ్యాచులో ఆడతారని నమ్మకంగా ఉన్నాం. వారు సెమీస్‌ ఆడాలని కోరుకుంటున్నారు' అని అన్నాడని పాక్‌ జియోటీవీ తెలిపింది.






Also Read: Indian Team Squad: 'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక


Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !


Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి