స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 81 బంతులు మిగిలి ఉండగానే.. భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. అయితే ఎంత తేడాతో గెలిచినా.. నెట్ రన్‌రేట్ ఎంత పెంచుకున్నా.. న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించకుంటే అంతా బూడిదలో పోసిన పన్నీరే.
ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ భారత్ భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌పై గెలిస్తే.. అవి రెండూ ఐదు మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలతో ఆరు పాయింట్లతో ఉంటాయి. ఆ తర్వాతి రోజు భారత్, నమీబియా మ్యాచ్ ఉంది. కాబట్టి ఆఫ్ఘన్ గెలిస్తే.. టీమిండియా ఎంత తేడాతో గెలవాలనే సమీకరణాలపై ఒక క్లారిటీ వస్తుంది.
ఒకవేళ ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం వాళ్లు నేరుగా సెమీస్‌కు చేరుకుంటారు. భారత్ అస్సాం ట్రైన్ ఎక్కేస్తుంది. కాబట్టి మనం నిలవాలంటే ఆఫ్ఘన్ గెలవాల్సిందే.
ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సమానంగా రెండు విజయాలే సాధించినప్పటికీ.. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి భారత్ మూడో స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ నాలుగో స్థానానికి పడిపోయింది.
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో నమీబియా ఐదో స్థానంలో ఉండగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవని స్కాట్లాండ్ అట్టడుగున ఉంది. ఈ రెండు జట్లూ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఈ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ప్రస్థానం ముందుకు వెళ్తుందో లేదో తెలియాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. ఆఫ్ఘన్ మీద భారం వేయడం తప్ప ప్రస్తుతం టీమిండియా చేతుల్లో ఏమీ లేదు.
Also Read: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ