ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది. ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్సులో రెండు రివ్యూలు ఉంటాయి. కరోనా మహమ్మారి ఇతర కారణాల వల్ల అనుభవజ్ఞులైన అంపైర్లు అందుబాటులో ఉండటం లేదు. అందుకే మరో అదనపు రివ్యూనూ ఇస్తున్నట్టు ఐసీసీ తెలిపింది.
Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. మొదటి ఫైనల్ బెర్త్ ఎవరికో?
వర్షం కురిసినప్పుడు వేయాల్సిన కనీస ఓవర్ల నిబంధనలోనూ ఐసీసీ మార్పు చేసింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఫలితం తేల్చేందుకు ఒక్కో జట్టు ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఇక సెమీస్, ఫైనల్‌కైతే కనీసం పది ఓవర్లు ఆడాలని బోర్డు స్పష్టం చేసింది.
Also Read: ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతి ఇదే.. ‘టేక్ ఏ బో’ అన్న ప్రముఖ క్రికెటర్.. బాల్ ఏ రేంజ్‌లో తిరిగిందంటే?
ఐసీసీ టోర్నీల్లో డీఆర్‌ఎస్‌ను ఆలస్యంగా ప్రవేశపెట్టారు. 2018లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈ విధానం అమలు చేశారు. ఐతే ఒక ఇన్నింగ్స్‌కు ఒక రివ్యూనే ఇచ్చారు. పురుషుల క్రికెట్లో 2017లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రవేశపెట్టారు. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ అమలు చేశారు.
Also Read: వెళ్తున్నాం.. వెళ్తున్నాం.. భారంగా వెళ్తున్నాం! ముంబయి, రాజస్థాన్, పంజాబ్, హైదరాబాద్ సందేశాలు!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడింది. జట్లన్నీ మెగాటోర్నీకి సిద్ధమవుతున్నాయి. అతిత్వరలో చిన్న జట్లతో అర్హత పోటీలు మొదలవుతాయి. రెండు బృందాలుగా విడిపోయి ఆడిన వీరిలో మొత్తం నలుగురు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తారు. 2007 నుంచి పొట్టి ప్రపంచకప్‌లు నిర్వహిస్తుండగా వెస్టిండీస్ మాత్రమే రెండుసార్లు ట్రోఫీని గెలిచింది. భారత్, పాక్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఒక్కోసారి విజేతలుగా ఆవిర్భవించాయి.
Also Read: డేవిడ్ వార్నర్ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్ మంజ్రేకర్ అనుమానం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి