మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చి ఓటు వేసి వెళ్లారు. అయితే ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య పోలింగ్ కేంద్రం వద్ద వివాదం నెలకొంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎన్నికల అధికారి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య పోలింగ్ కేంద్రంలో మాటా మాటా పెరిగింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేసుకున్నా్రు.  అయితే ఈ వాగ్వాదం మధ్యలో బెనర్జీని చంపేస్తానంటూ మోహన్ బాబు హెచ్చరించినట్టు తెలుస్తోంది. 


గత రెండు మూడు నెలలుగా ‘మా’ ఎన్నికలపై జరుగుతున్న రచ్చకు నేటితో ఫుల్‌స్టాప్ పడనుంది.  ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, విష్ణులలో ఎవరో ఒకరు ‘మా’ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ ఇద్దరి ప్యానల్స్‌లో ఎవరైతే గెలుస్తారో.. వారితో నూతన ‘మా’ అధ్యక్షుడు పాలన కొనసాగిస్తారు. అలాగే, ఇన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వారంతా మేమంతా ఒకటే అంటూ కలిసి పని చేసుకుంటారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో పోలింగ్‌ జరుగుతోంది. 


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో మొత్తం 925మంది సభ్యులు ఉన్నారు. 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500లకు పైగా సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్‌ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ కో-ఆపరేటివ్‌ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో  పోలింగ్‌ను నిర్వహిస్త్తున్నారు. ఎన్నికలకు 50మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8గంటల తర్వాత 'మా' అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
 
ఉదయమే.. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్. అయితే నిన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వాళ్లు.. ఇవాళ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.  అంతకుముందు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు కరచాలనం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌.. మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు.. విష్ణుతో ప్రకాశ్‌రాజ్‌కు కరచాలనం చేయించారు. తర్వాత విష్ణు-ప్రకాశ్‌రాజ్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.


Also Read: 'నాకు నేనే కింగ్..' షణ్ముఖ్ కామెంట్ కి నాగార్జున పంచ్..


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!



Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి