బిగ్ బాస్ సీజన్ 5 ఈ వారంతో ఐదు వారాలు పూర్తి చేసుకోబోతుంది. ప్రతి వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ లాంటి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఐదో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం తొమ్మిది మంది హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది.
అందులో 'కొండపొలం' సినిమా దర్శకుడు క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ వచ్చి హౌస్ లో సందడి చేశారు. ఇప్పుడు మరో ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో హౌస్ మేట్స్ తో రూలర్ ఎవరు..? స్లేవ్(బానిస) ఎవరు..? అనే టాస్క్ ఆడించారు నాగార్జున. ముందుగా ప్రియా.. శ్రీరామచంద్రని రూలర్ గా ఎన్నుకొని అతడికి కిరీటం పెట్టింది. వెంటనే నాగార్జున.. 'అతను ఎవరికో స్లేవ్ అనుకున్నా నేను' అంటూ కౌంటర్ వేశారు నాగార్జున. దానికి శ్రీరామచంద్ర దండం పెడుతూ నవ్వేశాడు.
Also Read: ప్రకాష్ రాజ్ చుట్టూ వివాదాలే.. బ్యాన్ చేసిన మెగాఫ్యామిలీ ఈరోజు సపోర్ట్ చేస్తుందే..
ఆ తరువాత షణ్ముఖ్.. హమీదని స్లేవ్ అని చెబుతూ.. 'నా ఈ వీక్ హమీద కనిపించలేదు సర్.. ఈ హౌస్ లో ఓన్లీ 14 కంటెస్టెంట్స్ ఆడుతున్నారనిపించింది' అని చెప్పగా.. వెంటనే హమీద.. 'నువ్ ఆడావా..?' అని ప్రశ్నించింది. శ్రీరామచంద్ర రూలర్ కిరీటం కాజల్ కి పెడుతూ.. 'హౌస్ అంతా తన గురించి మాట్లాడుకునేటట్లు చేస్తున్న కాజల్ ఈజ్ ఏ రూలర్ సర్' అని చెప్పాడు. దానికి నాగ్ 'చిన్న వెటకారం ఉంది' అనగా.. కాజల్ 'బరాబర్ ఉంది' అని చెప్పింది.
మానస్ కూడా స్లేవ్ గా హామీదను సెలెక్ట్ చేసి 'వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ స్లేవ్ అయిపోతుంది అనిపిస్తుంది.. గేమ్ ఆడు హమీద ప్లీజ్' అని రీజన్ చెప్పాడు. ఆ వెంటనే హమీద రూలర్ కిరీటం మానస్ కి పెడుతూ.. 'రాజ్యంలో టాస్క్ మొత్తం మానసే ఆడినట్లు నాకు అనిపించింది' అని రీజన్ చెప్పింది. ఆ తరువాత షణ్ముఖ్ తనకు తనే కిరీటం పెట్టుకొని ఫోజిచ్చాడు. దానికి నాగ్ 'ఏంట్రా ఇది' అనగా.. 'నాకు నేనే కింగ్ సర్ హౌస్ లో.. ఎవరూ ఇవ్వక్కర్లేదు' అని చెప్పాడు. దానికి నాగ్ 'ఇలాంటి పని చేశావ్ కాబట్టే.. 8 మెంబర్స్ నామినేట్ చేశారు నిన్ను' అని పంచ్ వేశారు. 'ఎవరూ ఓపెన్ గా చేయలేదని' షణ్ముఖ్ అనగా.. 'ఓపెన్ గా అయినా.. నేను చేసేదాన్ని' అంటూ ప్రియా చెప్పింది. తర్వాత సిరి రూలర్ కిరీటం రవికి పెట్టింది. అది చూసిన నాగ్.. 'రవి ఏంటో తెలుసా సిరి.. బాగా తెలివితేటలు ఉన్న యానిమల్' అని కౌంటర్ వేశారు.