ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అంటున్నాడు. ఆస్ట్రేలియాను మాత్రం చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దని సూచిస్తున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 పోటీలు మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్నాయి. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, శ్రీలంక సూపర్-12కు అర్హత సాధించే దిశగా ముందడుగు వేశాయి. ఇక ఆదివారం భారత్, పాక్ తొలి మ్యాచులో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్న్ వరుస ట్వీట్లు చేశాడు.
'టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ సైతం బాగా ఆడుతుంది. కానీ ఆస్ట్రేలియాను చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. ఆ జట్టులో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక పాకిస్థాన్, వెస్టిండీస్ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకే ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది' అని వార్న్ ట్వీట్ చేశాడు.
'ఫామ్‌లో లేని డేవిడ్ వార్నర్, ఇయాన్ మోర్గాన్‌ను జట్టులోకి తీసుకోవద్దని కొందరు కోరుకుంటున్నారు! ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అన్నది వారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారిలో ఎవరో ఒకరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనా ఆశ్చర్యం లేదు' అని మరో ట్వీట్‌లో వార్న్ అన్నాడు. మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారో చెప్పాలని అభిమానులను కోరాడు.
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ