టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మాటలు నచ్చలేదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. పాక్‌ చేతిలో ఓటమి తర్వాత అతడి వ్యాఖ్యలు నిరాశపరిచాయని పేర్కొన్నాడు. ఓపెనర్లు ఔటవ్వడంతో మ్యాచ్‌లో వెనకబడ్డామని అనడంలో అర్థం లేదని తెలిపాడు. కోహ్లీ క్రీజులో ఉండి అలాంటి మైండ్‌సెట్‌తో నడిపితే ఎలాగని ప్రశ్నించాడు.


దుబాయ్‌ వేదికగా గత ఆదివారం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడ్డాయి. మొదట్లో అంచనాలన్నీ కోహ్లీసేన మీదే ఉన్నాయి. పాక్‌ను వారు చిత్తు చేస్తారని అంతా అనుకున్నారు. అనూహ్యంగా ఘోర ప్రదర్శనతో టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పాక్‌ యువ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ను వరుసగా ఔట్‌ చేశాడు.  అర్ధశతకం చేశాక విరాట్‌ కోహ్లీని ఆఖర్లో ఔట్‌ చేశాడు.


ఓపెనర్లు ఇద్దరూ ఔటవ్వడంతోనే మ్యాచులో భారత్‌ వెనకబడిందని విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన విరాట్‌ కోహ్లీ స్వయంగా క్రీజులో ఉన్నప్పుడు అలా అనుకోవడమేంటని జడ్డూ అంటున్నాడు. 'ఆ రోజు విరాట్‌ కోహ్లీ వ్యాఖ్యలు విన్నాను. రెండు వికెట్లు పడగానే మనం వెనకబడిపోయామని అతడు అన్నాడు. ఆ వ్యాఖ్యలతో నేను నిరాశచెందాను' అని జడేజా అన్నాడు.


'గొప్ప ఆటగాడైన విరాట్‌ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు మ్యాచ్‌ పని అయిపోయిందని ఎలా అనుకుంటాం? అలాంటి పరిస్థితే ఉండదు. అతడు కనీసం రెండు బంతులైనా ఆడకుండానే అలాంటి ఆలోచనలు చేశాడు. ఇదే టీమ్‌ఇండియా వైఖరి, మ్యాచు సన్నద్ధతను ప్రభావం చేస్తోంది' అని అజయ్ తెలిపాడు.


Also Read: Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!


Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!


Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?


Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి