పాకిస్థాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది! మహ్మద్ షమీపై ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో దాడి చేసింది. మైండ్‌గేమ్‌లో భాగంగా అసత్య ప్రచారానికి ఒడిగట్టింది. షమీపై చేసిన మత పరమైన ట్రోలింగ్‌కు కారణం పాకిస్థానే అని తాజా సమాచారం.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ గత ఆదివారం తలపడ్డాయి. టీమ్‌ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని దాయాది సులభంగానే ఛేదించింది. బంతికో పరుగు చేయాల్సిన తరుణంలో 18 ఓవర్‌ను కోహ్లీ.. మహ్మద్ షమీతో వేయించాడు. మంచు ఎక్కువగా కురవడం, బంతి తడి అవ్వడం, పట్టు చిక్కకపోవడంతో ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4 పరుగులు వచ్చాయి. దాంతో బాబర్ జట్టు గెలుపు ఖరారైంది.
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మహ్మద్ షమీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పాక్‌కు అనుకూలంగా బౌలింగ్ చేశాడని, ఐఎస్‌ఐ ఏజెంట్ అంటూ పరుష పదజాలంతో నెటిజన్లు విమర్శలు చేశారు. దాంతో టీమ్‌ఇండియా, బీసీసీఐ, మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు. జట్టంతా ఓడిపోయిందని, ఒక్కరిపైనే విమర్శలేంటని ప్రశ్నించారు. రాజకీయ వర్గాలూ ఈ వ్యవహారంపై స్పందించాయి.
తాజాగా తెలిసిందేమిటంటే.. షమీపై కామెంట్లు చేసిన వారి ఖాతాల్లో చాలా వరకు నిజమైనవి కావు. ట్రోలింగ్‌లో బాట్స్ పాల్గొన్నాయని, పాక్‌కు చెందిన వారూ ట్రోలింగ్‌కు దిగారని తెలిసింది. కొన్ని స్క్రీన్‌షాట్లు సైతం దీనిని ధ్రువీకరిస్తున్నాయి. 'కౌంటర్ ప్రాపగండా' అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ట్వీట్ చేశారు.
'షమీని నిందించింది ఎవరు? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్య ప్రచారం. కొంతమంది యూజ్‌ఫుల్ ఇడియట్స్ పాత్ర ఇందులో ఉంది. ఇది కీలకమైన మ్యాచ్. ఉద్వేగాలు ముడిపడి ఉంటాయి. మైదానంలో టీమ్ఇండియా ఫీల్డింగ్ బాగాలేదు. మ్యాచ్ పూర్తవ్వగానే మైండ్‌గేమ్ మొదలు పెట్టారు' అని కౌంటర్ ప్రాపగండ డివిజన్ ట్వీట్ చేసింది. అతడిపై ట్రోలింగ్ చేసిన కొన్ని ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను పరిశీలించగా చాలా వరకు బాట్స్ అని తెలిశాయంది. మరికొన్ని ఖాతాల్లో వివరాలే సరిగ్గా లేవు. ఇందులో చాలా వరకు పాకిస్థాన్ నుంచే నియంత్రించారని వారు అంటున్నారు.
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి