టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 స్టేజ్ ఎంతో ఉత్కంఠతో సాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఉన్న గ్రూప్-2లో పాకిస్తాన్ ఇప్పటికే సెమీఫైనల్స్‌కు వెళ్లిపోయింది. రెండో స్థానం కోసం న్యూజిలాండ్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి. అయితే చిన్న జట్లతో మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి న్యూజిలాండ్‌కు కాస్త ఎడ్జ్ ఉంది. ఇక గ్రూప్-1 కూడా అంతే ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ గ్రూపులో నాలుగు విజయాలతో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది.


రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. వీటిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నాలుగేసి మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 6.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్‌ను ఎంతో మెరుగుపరుచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.


వీటి భవిష్యత్తు శనివారం తేలిపోనుంది. ఆరోజు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తోనూ, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తోనూ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే.. అప్పుడు మళ్లీ నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. 


అలా కాకుండా ఆస్ట్రేలియా ఓడి.. దక్షిణాఫ్రికా గెలిస్తే ప్రొటీస్‌కు సెమీస్ అవకాశం ఉంటుంది. దక్షిణాఫ్రికా ఓడి.. ఆస్ట్రేలియా గెలిస్తే కంగారూలు సెమీస్‌కు వెళ్తారు. ఒకవేళ వీరిద్దరూ ఓడిపోయినా.. అప్పుడు మళ్లీ నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. ఇక్కడ దక్షిణాఫ్రికాకు కలిసొచ్చే అంశం ఏంటంటే.. వారు ఆడాల్సింది రెండో మ్యాచ్ కాబట్టి.. సమీకరణాలు వారికి పూర్తిగా తెలుస్తాయి. ఆస్ట్రేలియా మ్యాచ్ ఫలితాన్ని బట్టి వ్యూహరచన చేసుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియాది మొదటి మ్యాచ్ కాబట్టి భారీ విజయమే లక్ష్యంగా ఆడాల్సి ఉంటుంది.


ఇక వెస్టిండీస్‌ది మరో కథ. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ తన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిచి.. శనివారం మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోతే.. వారికి కూడా అవకాశం ఉంటుంది.


పాయింట్ల పట్టికను చూస్తే.. ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచిన ఇంగ్లండ్ 8 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చెరో ఆరు పాయింట్లతో ఉన్నప్పటికీ.. మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. రెండు పాయంట్లతో శ్రీలంక నాలుగో స్థానంలో ఉండగా, ఐదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ కూడా రెండు పాయింట్లతోనే ఉంది. అయితే విండీస్‌కు ఇంకో రెండు మ్యాచ్‌లు ఉండగా.. లంక ఒకటి మాత్రమే ఆడాల్సి ఉంది. ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన బంగ్లాదేశ్ పట్టికలో చివరి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు ఇంక ఒక్క మ్యాచ్ కూడా లేదు.


Also Read: PAK vs NAM, Match Highlights: సెమీస్ కు పాక్‌.. వరుసగా నాలుగో విక్టరీ! నమీబియాకు హ్యాట్సాఫ్‌.. కాసేపు వణికించారు!


Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ


Also Read: SA vs BANG, Match Highlights: సెమీస్‌ రేసులో సఫారీలు..! బంగ్లా 84కే చిత్తు.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ


Also Read: Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్‌ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి