ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 36,373 పరీక్షలు నిర్వహించగా.. 301 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,388కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 367 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,49,338 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,830 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.






దేశంలో తాజాగా కరోనా కేసులు పెరిగాయి. 10,67,914 మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తే..12,885 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొద్ది రోజులుగా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కొత్తగా 461 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 3.43 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15,054 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 


ప్రస్తుతం 1,48,579 మంది చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 0.43 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.23 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,59,652 మంది కరోనా వైరస్ కు బలయ్యారు. నిన్న 30.9లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 107.63 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.