టీ20 వరల్డ్ కప్‌లో నేడు డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ వరల్డ్‌కప్‌లో ఇది రెండో సూపర్ 12 మ్యాచ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 2016 వరల్డ్‌కప్ ఫైనల్లో ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ చివరి ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టడంతో.. నాటకీయ పరిస్థితుల్లో వెస్టిండీస్ విజయం సాధించింది.
ఇంగ్లండ్ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు. జేసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, బెయిర్ స్టో.. ఇలా టాప్-4 బ్యాట్స్‌మెన్ సూపర్ ఫాంలో ఉన్నారు. వీరికి తోడుగా లియాం లివింగ్ స్టోన్, మోర్గాన్, మొయిన్ అలీ కూడా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో కూడా ఇంగ్లండ్ బలంగానే ఉంది. క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ బంతితో చెలరేగిపోతున్నారు.
ఇక వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కూడా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో నిండిపోయింది. ఎవిన్ లూయిస్, లెండిల్ సిమ్సన్స్, క్రిస్ గేల్, హెట్‌మేయర్, పూరన్, పొలార్డ్, రసెల్, బ్రేవో.. ఇలా ఎవరిని చూసినా.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పేవాళ్లే కనిపిస్తున్నారు. అయితే బౌలింగ్ విషయంలో మాత్రం వెస్టిండీస్ కాస్త వెనకపడింది. రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, ఓషేన్ థామస్‌లు బంతితో అంత ప్రభావం చూపలేకపోతున్నారు.
ఈ రెండు జట్లూ ఇంతవరకు 18 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తలపడగా.. 11 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, 7 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. అయితే ఈ రెండు జట్లూ టీ20 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు తలపడగా.. ఐదు మ్యాచ్‌ల్లోనూ వెస్టిండీసే విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ఆ రికార్డుకు తెర పడనుంది.
ఇంగ్లండ్ తుదిజట్టు(అంచనా)
జేసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలన్, బెయిర్ స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియాం లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
వెస్టిండీస్ తుదిజట్టు(అంచనా)
ఎవిన్ లూయిస్, లెండిల్ సిమ్సన్స్, క్రిస్ గేల్, షిమ్రన్ హెట్‌మేయర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రేవో, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, ఓషేన్ థామస్
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ