యోగీ మార్క్ ట్రీట్‌మెంట్ మళ్లీ మొదలైంది! పాకిస్థాన్ విజయానికి సంబరాలు చేసుకున్న వారిపై కేసులు పెడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటికే కొందరిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ఇంకా ఎవరెవరు వేడుకలు చేసుకున్నారో పోలీసులు గాలిస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిని భరించలేక దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ కొందరు పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. పాక్ అనుకూల నినాదాలు చేశారు.
అప్పటి నుంచి సంబరాలు చేసుకున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఐదు జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురిని బుక్ చేశారు. పాక్ అనుకూల నినాదాలు చేయడంతో అందులో నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్) సహా ఇతర సెక్షన్లు వీరిపై పెడుతున్నారు. ఆగ్రా, బరేలీ, బదావున్, సీతాపుర్ జిల్లాల్లో ఐదు కేసులు పెట్టామని యూపీ పోలీసులు తెలిపారు. అందులో ఐదుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్ పోలీసులు సైతం ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో పాక్ అనుకూల నినాదాలు చేసి అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. అంతకు ముందు శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న కొందరు వైద్య విద్యార్థులను యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోనూ నఫీసా అటారీ అనే ప్రవేట్ స్కూల్ టీచర్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గెలిచినందుకు అతడు వేడుకలు చేసుకుంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు.
వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ సహా మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు సంబరాలు చేసుకోవడాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. దీపావళికి టపాకాయలను నిషేధించే ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ పనిచేయలేదని, ఇది వంచన కిందకే వస్తుందని వీరూ అన్నాడు. పాక్ గెలుపునకు సంబరాలు చేసుకున్న వారు అసలు భారతీయులే కారని గంభీర్ స్పష్టం చేశాడు.
Also Read: Shami Latest News: పాక్ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్.. ఇవిగో సాక్ష్యాలూ..!
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి