టాలీవుడ్ ప్రముఖ హీరో నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తాడేపల్లి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడ్నుంచి నేరుగా సీఎం క్యాంపాఫీసుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. నాగార్జున వెంట ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి అనే ఇద్దరు నిర్మాతలు ఉన్నారు. వారితో కలిసి జగన్ లంచ్ చేశారు. లంచ్ భేటీ తర్వతా నాగార్జున మీడియాతో మాట్లాడారు. జగన్‌ తన శ్రేయోభిలాషి అని.. ఆయనను చూసి చాలా రోజులయినందున వచ్చానన్నారు. నాగార్జున వచ్చిన సమయంలో కేబినెట్ భేటీ జరుగుతోంది. ఒంటి గంట సమయంలో కేబినెట్ భేటీ ముగిసింది. 


Also Read : "టాలీవుడ్ బాస్‌ " పాత్రకు చిరంజీవి న్యాయం చేయలేకపోతున్నారా..!?


ఇటీవలి కాలంలో టాలీవుడ్‌కు సంబంధించిన అనేక సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో  వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం దానిపై రాజకీయ రగడ జరిగింది. అయితే ఈ వివాదంలో నాగార్జున ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అఖిల్ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో మాత్రం పరోక్షంగా స్పందించారు. రెండు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.  సినిమాల అంశం కాకుండా చూస్తే జగన్, నాగార్జున మధ్య మంచి స్నేహం ఉందని చెబుతూంటారు. జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసుల్లో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జునకు అత్యంత ఆప్తుడు. వ్యాపార భాగస్వామి కూడా. ఆయన జైల్లో ఉన్నప్పుడు నాగార్జున తరచూ వెళ్లి ములాఖత్ అయ్యేవారు. ఆ క్రమంలో జగన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని చెబుతూంటారు. 


Also Read : ‘మా’కు మోడీకి ఏంటి సంబంధం ? ‘అతి’ స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !


వ్యక్తిగత పనుల వల్ల కలవడానికి వచ్చారా లేక సినిమా రంగ సమస్యలపై చర్చించడానికి వచ్చారా అన్నదానిపై స్పష్టత లేదు.  సినిమా రంగ సమస్యలపై చర్చించడానికి వస్తే ఒక్కరే రారని.. కొంత మంది ప్రముఖుల్ని తీసుకుని వచ్చే వారని అంటున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ బాబు కుమారుడు విష్ణు ఎంపికయ్యారు. ఆయన తోడుగా వచ్చి ఉండేవారని అంటున్నారు. పూర్తిగా వ్యక్తిగత విషయాలను చర్చించడానికే వచ్చి ఉంటారని భావిస్తున్నారు. 


Also Read : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?


ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాల అంశాన్ని కేబినెట్‌లో ఆమోదం తెలిపే సమయంలోనే నాగార్జున జగన్‌ను కలిసేందుకు రావడంతో సహజంగానే టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమయింది. అయితే ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మేలా కేబినెట్ నిర్ణయం తీసేసుకుంది.  వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్నది అధికారికంగా ప్రకటిస్తేనే తెలుస్తుంది. వ్యక్తిగత వ్యవహారం అయితే ప్రకటించే అవకాశం లేదు. నాగార్జున కూడా వ్యక్తిగతం అని చెప్పడంతో సినిమా అంశాలపై చర్చ జరిగిందో లేదో క్లారిటీ లేదు.


Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి