న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో తను ఆడటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాండ్యా భుజానికి గాయం అయింది. 


మ్యాచ్ ముగిసిన వెంటనే హార్దిక్‌ను స్కానింగ్‌కు పంపారు. అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యాను తీసుకుంటారో.. ప్రత్యామ్నాయంతో వెళ్తారో చూడాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈ మధ్యకాలంలో బౌలింగ్ వేయడం లేదు. ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం కావాలనుకుంటే.. హార్దిక్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది.


హార్దిక్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే హార్దిక్ వస్తాడా, పాండ్యా వస్తాడా అనే విషయాలు తెలియాలంటే.. ఆదివారం వరకు ఆగాల్సిందే. పాండ్యా కూడా ఒకప్పుడు ఉన్న ఫాంలో లేడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా.. హార్దిక్ సరిగా ఆడలేకపోయాడు.


వెన్నెముక ఇప్పుడు బాగానే ఉందని, అయితే ప్రస్తుతానికి తాను బౌలింగ్ చేయబోయేది లేదని హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు అన్నాడు. అయితే టోర్నీ ముందుకు సాగేకొద్దీ తాను మెల్లగా బౌలింగ్ కూడా ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపాడు. తానెప్పుడు బౌలింగ్ చేయాలనే అంశంపై వైద్య నిపుణులు, తను కలిసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు.


ఇండియా, పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది కాబట్టి.. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. న్యూజిలాండ్‌పై విజయం సాధించాల్సిందే. పాకిస్తాన్ చేతిలో 10 వికెట్లతో ఓటమి పాలవడం భారత్ నెట్‌రన్‌రేట్‌ను కూడా బాగా దెబ్బ తీసింది. 


Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?


Also Read: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!


Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?


Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి