Sourav Ganguly Corona Positive: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. గత రెండు మూడు రోజులుగా కాస్త నలతగా ఉండటంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన కోల్ కతా లోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్‌ (Woodlands Hospital)లో చేరి చికిత్స పొందుతున్నారని సమాచారం. గంగూలీ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి సోమవారం రాత్రి  కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా.. రిపోర్టులో కొవిడ్19 పాజిటివ్‌గా వచ్చింది. గంగూలీకి కరోనా వైరస్ సోకడం ఇది తొలిసారి. గతంలో ఐపీఎల్ 2021కు కొన్ని రోజుల ముందు గంగూలీ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గంగూలీ సైతం కోవిడ్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసుపత్రి పాలయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారని తెలిసిందే.
Also Read: Australia Won Ashes Series: ఇంగ్లాండ్‌కు దారుణ పరాభవం.. 3-0తో యాషెస్ సిరీస్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా 







ఈ ఏడాది అనారోగ్య సమస్యలు..
జనవరి 2న సౌరవ్ గంగూలీకి ఛాతీలో నొప్పి రావడంతో కోల్‌కతాలోని ఇదే వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్‌లో చేరారు. ఇంట్లోని జిమ్‌లో ట్రెడ్‌మిల్ చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. గంగూలీ తర్వాత, అతడి సోదరుడు (అన్నయ్య) స్నేహాశిష్ గంగూలీ కూడా యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఈ ఏడాది కరోనా, ఛాతీలో నొప్పి లాంటి సమస్యలు ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. 







గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,358 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 6,450 మంది బాధితులు కరోనాను జయించారు. దేశంలో మొత్తం 653 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో యాక్టివ్ కరోనా కేసులు 75,456కు చేరుకున్నాయి. రికవరీ రేటు 98.40 శాతానికి మెరుగైంది.
Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్! 
Also Read: Power Lifting: పవర్ లిఫ్టింగ్ లో భారత్ కు బంగారు పతకం అందించిన 66 ఏళ్ల మహిళ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి