AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం దాదాపుగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి తగ్గింది. ఓవైపు ఉత్తర దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గాడిన పడ్డాయి. ప్రజలు మార్నింగ్ వాకింగ్‌కు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయి. నేడు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నప్పటికీ రాష్ట్రంలో వాతావరణం గత కొద్ది రోజుల నుంచి పొడిగా ఉంది. తెలంగాణ వాతావరణంలో నేడు కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. డిసెంబర్ 28, 29 తేదీలలో రాష్ట్రంలో పలు చోట్ల అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వీచే గాలులు, వాతావరణంలో మార్పుల ఆధారంగా డిసెంబర్ 30న సైతం వర్ష సూచన ఉందని సమాచారం. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. అయితే చలి గాలులు వీచనున్నాయి. విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి సాధారణంగా ఉంది. పొగ మంచు ప్రభావం సైతం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.
దక్షిణ కోస్తాంద్రలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నందిగామలో 18 డిగ్రీలు, తునిలో 21.4 డిగ్రీలు, కళింగపట్నంలో 18.9 డిగ్రీలు, విశాఖపట్నంలో 22.8 డిగ్రీలు, కాకినాడలో 21 డిగ్రీలు, విజయవాడలో 19.6 డిగ్రీలు, మచిలీపట్నంలో 20.6 డిగ్రీలు, బాపట్లలో 17.4 డిగ్రీలు, అమరావతిలో 18.6 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 17.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసమీలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కడపలో 19.4 డిగ్రీలు, తిరుపతిలో 18.4 డిగ్రీలు, కర్నూలులో 18.5 డిగ్రీలు, అనంతపురంలో 16.2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: Tirupati: టీటీడీ కీలక నిర్ణయం... ఆ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించరు... స్వయంగా వచ్చే వీఐపీలకే బ్రేక్ దర్శనం
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
Also Read: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత