టెక్నాలజీ ఎంత పెరిగినా అంపైరింగ్‌లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. కోల్‌కతాతో ఎలిమినేటర్లో అంపైర్ వీరేందర్ శర్మ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిర్ణయం ప్రకటించిన వెంటనే అతడి వద్దకు వెళ్లి వివరణ అడిగాడు.
Also read: షాకింగ్ న్యూస్! పంజాబ్‌ను వదిలేయనున్న కేఎల్ రాహుల్.. ఆర్‌సీబీ కన్ను పడిందా?
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ను యుజ్వేంద్ర చాహల్ వేశాడు. ఆ బంతి మొదట బ్యాటర్ ప్యాడ్లకు తగిలింది. అది గమనించని వీరేందర్ శర్మ ఔటివ్వలేదు. దాంతో కోహ్లీ సమీక్ష తీసుకున్నాడు. అందులో బంతి ప్యాడ్లకు తగిలినట్టు కనిపించింది. అంతే కాకుండా బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకుతోంది. ఆ తర్వాత అంపైర్ తన నిర్ణయం మార్చుకొన్నాడు. అప్పటి వరకు అంపైర్‌ను ప్రశ్నించిన కోహ్లీ ఆ తర్వాత నవ్వుతూ తిరిగొచ్చాడు.
Also read: జయమ్ము నిశ్చయంబురా! అని ఆడితే కేకేఆర్‌పై దిల్లీ గెలవొచ్చు.. లేదంటే!
అంపైర్ వీరేందర్ శర్మ ఈ ఐపీఎల్‌లో తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందూ నిర్ణయాల్లో పొరపాటు జరిగింది. ఏదేమైనా అంపైర్‌ను ప్రతిదానికీ వివరణ కోరడం తప్పని సునిల్ గావస్కర్ అంటున్నాడు. ఆ నిర్ణయం ఓవర్‌టర్న్ అవ్వగానే కామెంటరీ బాక్స్‌లో తన అభిప్రాయం చెప్పాడు. 'ఏదేమైనా అది అంపైర్ నిర్ణయం. తప్పైనా, ఒప్పైనా అతడు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు' అని విమర్శించాడు. ఇక ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Also read: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి