కొద్దిసేపటి క్రితం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. కానీ, ఏమైందో తెలియదుకానీ, జట్టును ప్రకటించిన కొద్దిసేపటికి రషీద్ ఖాన్ తాను కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించలేనని, కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపాడు.
Also Read: Ind vs Eng, 5th Test: గుడ్ న్యూస్.. యథాతథంగా 5వ టెస్ట్ మ్యాచ్, అందరికీ కొవిడ్ నెగటివ్
అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు UAE వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్ తన తొలి మ్యాచ్ అక్టోబరు 24న ఆడనుంది. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు గురువారం ప్రపంచకప్‌లో పాల్గొనబోయే ఆ దేశ క్రికెట్ జట్టును ప్రకటించింది. రషీద్ ఖాన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
ఆ కొద్దిసేపటికే రషీద్ ఖాన్ ట్విటర్లో ఓ పోస్టు చేశాడు. ‘కెప్టెన్‌గా దేశం తరఫున బాధ్యతలు నిర్వహించడం చాలా గొప్పగా ఫీలవుతాను. సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) నన్ను కెప్టెన్‌గా ఎంచుకుంది. అఫ్గానిస్థాన్ టీ20 జట్టుకు నేను కెప్టెన్సీ పదవి నుంచి నేను వైదొలుగుతున్నాను. నా దేశం తరఫున ఆడేందుకు నేను గర్వంగా ఫీలవుతాను’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు.
రషీద్ ఖాన్ IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రషీద్‌తో పాటు అఫ్గాన్ క్రికెటర్లు ద హండ్రెడ్ లీగ్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నారు. సెప్టెంరు 19 నుంచి IPL - 2021 మిగతా సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.