విరాట్ కోహ్లీ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో అందరికీ ఊహించని షాక్ తగిలినట్టైంది. భారత అభిమానులేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విరాట్ అభిమానులు ఈ విషయంపై స్పందించారు. అయితే తాజాగా.. పాకిస్థాన్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ కూడా తన ఆవేదనను తెలిపింది. విరాట్ కోహ్లి భారత సూపర్‌స్టార్ మాత్రమే కాదు, గ్లోబల్ ఐకాన్ అంటూ కైనత్ పొగిడింది.
భారత టెస్టు సారథి పదవికి కోహ్లి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా కోహ్లీ పేరు ట్రెండింగ్ లో నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి అతడి అభిమానులు స్పందించారు. పాకిస్థాన్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ సైతం స్పందించింది. కోహ్లీని 'Real G.O.A.T(Greatest Of All Time)'గా అభివర్ణించింది. తనదైన శైలిలో కోహ్లీ ముందుకెళ్తూ వచ్చాడని.., కోహ్లీ కెప్టెన్సీ స్ఫూర్తిదాయకంగా ఉందని కైనత్ పేర్కొంది. మనం చూసిన గొప్ప కెప్టెన్లలో కోహ్లీ ఒకరు అని చెప్పింది.
ఇటీవలే.. సుదీర్ఘ ఫార్మాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ ప్రకటించాడు. కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని.. సెంచరీల వరద పారిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల గుండెలు బద్దలు చేశాడు. ఏడేళ్ల సారథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని కోహ్లీ చెప్పాడు. తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, తనను వ్యక్తిగా, ఆటగాడిగా వెలుగులోకి తీసుకొచ్చిన ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్టు చేశాడు.
2014, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో తెలియదు! జట్టు యాజమాన్యం ఏమైనా అందా తెలియదు! నాయకుడిగా జట్టును ముందుకు నడిపించలేక పోతున్నానని భావించాడా తెలియదు! వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం బాధించిందా తెలియదు! అనూహ్య నిర్ణయమైతే తీసుకున్నాడు. ఇక ఆటగాడిగానే కొనసాగనున్నాడు.
Also Read: Virat Kohli Resigns: బీసీసీఐపై కోహ్లీ అలిగాడా? జట్టుకు ముందు, బోర్డుకు ఒక రోజు తర్వాత రాజీనామా విషయం
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్ శర్మకు మాత్రం నో ఛాన్స్!