KL Rahul Next Indian Team Test Captain: టీమిండియా కెప్టెన్ల ఎంపిక విషయంలో గత అనుభవాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ ఇటీవల గుడ్ బై చెప్పగా.. కొత్త సారథి కోసం బీసీసీఐ అంతగా యోచించడం లేదు. తమకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. 


వైట్ బాల్ క్రికెట్ వన్డే, టీ20లకు రోహిత్ శర్మను ఇటీవల కెప్టెన్‌గా నియమించారు. కోహ్లీ టెస్టు పగ్గాలు వదిలేయడంతో రెడ్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. రోహిత్ శర్మకు టెస్టుల బాధ్యత కూడా అప్పగించవచ్చు. కానీ అన్ని ఫార్మాట్లలో ఒకరికే బాధ్యతలు అప్పగించడం సరైన కాదని ఇటీవల జరిగిన పరిణామాలతో బీసీసీఐ భావిస్తోంది. అన్ని ఫార్మాట్లకు ఒక్క కెప్టెన్ ఉంటే అతడిపై ఒత్తిడి, ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయని, వీటితో పాటు మరికొన్ని అంశాలు జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. సునీల్ గవాస్కర్ మాత్రం రిషబ్ పంత్‌కు టెస్టు పగ్గాలు ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


కేఎల్ రాహుల్‌ను టెస్టు సారథిగా నియమించాలని బోర్డు నిర్ణయించుకుందని బీసీసీఐ వర్గాల సమాచారం. టెస్టులకు సైతం రోహిత్‌కు పగ్గాలు అప్పగిస్తే.. కోహ్లీ కెప్టెన్సీ విషయంలో జరిగినవి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని బోర్డు పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో సారథిగా కొనసాగాలంటే ఫిట్ నెస్, పని భారం, ప్రస్తుతం కరోనా కండీషన్లు ఇలా చాలా అంశాలు సవాళ్లుగా మారుతాయి. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సైతం పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం చేసిన అనుభవం రాహుల్ సొంతం. కనుక రోహిత్‌పై అదనపు బారం మోపకుండా ఉండేందుకు బీసీసీఐ చూపు రాహుల్ వైపు ఉందని.. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది తెలుస్తోంది.


రాహుల్‌కే ఎందుకంటే..
రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా తాత్కాలికంగా ప్రయోజనం ఉంటుంది. త్వరలోనే అతడు సుదీర్ఘ మ్యాచ్‌ల ఫార్మాట్ నుంచి తప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. కేఎల్ రాహుల్ అయితే మరికొన్నేళ్ల పాటు టెస్టులు ఆడతాడు. జట్టుకు సైతం దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నారు. కోహ్లీకి గాయం, రోహిత్ డౌట్ అనగానే దక్షిణాఫ్రికా టూర్‌లో రాహుల్‌కు బాధ్యతలు అప్పగించారు. వన్డేలు, టీ20లకు ఓ కెప్టెన్.. టెస్టులకు మరో ఆటగాడు సారథిగా వ్యవహరిస్తే టీమిండియా మేనేజ్‌మెంట్ సగం తలనొప్పి తగ్గుతుందని సీనియర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.


Also Read: Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!


Also Read: ప్రపంచంలోని బెస్ట్‌ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్‌ డోన్ట్‌ వర్రీ ప్లీజ్‌!!


Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!


Also Read: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి