ఇస్లామాబాద్: పాకిస్థాన్ సమాచార మంత్రి ఫవాద్ ఛౌదరీ మరోసారి భారత్‌పై అసత్య ఆరోపణలు చేశారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారత్ నుంచే బెదిరింపు కాల్ వచ్చిందని అన్నారు. కివీస్ పర్యటనను రద్దుచేసుకొని స్వదేశానికి వెళ్లిపోవడానికి ఇదే కారణమని పేర్కొన్నారు.
దాదాపుగా 18 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటనకు వచ్చింది. గత శుక్రవారం మ్యాచ్ ఆరంభమవ్వడానికి కొన్ని నిమిషాల ముందే ఆకస్మికంగా పర్యటనను రద్దు చేసుకుంది. భద్రత పరంగా తమకు ముప్పు ఉందని తెలియజేసింది. ఇంగ్లాండ్ జట్టు సైతం ఇదే దారిని అనుసరించింది. వచ్చే నెల్లో ద్వైపాక్షిక సిరీసును రద్దు చేసుకుంటున్నామని సోమవారం ఈసీబీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పాక్ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ అహ్మద్‌తో కలిసి ఛౌదరీ మీడియాతో మాట్లాడారు. తెహ్రెక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాది ఎహ్‌సనుల్లా ఎహ్‌సన్ పేరుతో ఆగస్టులో న్యూజిలాండ్ జట్టుపై ఒక నకిలీ బెదిరింపు పోస్టు సృష్టించారని చెప్పారు. పాక్ జట్టును పంపిస్తే లక్ష్యంగా ఎంచుకుంటామని అందులో రాశారని పేర్కొన్నారు. అయినప్పటికీ కివీస్ పాక్‌కు వచ్చింది. తొలి మ్యాచ్‌కు ముందు తమ ప్రభుత్వానికి అభ్యంతరం ఉందని పర్యటన రద్దు చేసుకుంది.
Also Read: Afghanistan T20 WC Ban: అఫ్గాన్ క్రికెట్‌పై పిడుగు! ఐసీసీ జట్టును బహిష్కరించే ప్రమాదం!
'ముప్పు ఏంటో చెప్పాలని పాక్ క్రికెట్ బోర్డు అధికారులు, ఇంటీరియర్ మినిస్ట్రీ బృందం, ప్రతి ఒక్కరూ వారిని అడిగారు. కానీ మాలాగే వారికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు' అని పర్యటన రద్దైన తర్వాతి రోజు మంత్రి అన్నారు. హమ్జా అఫ్రిది పేరుతో కివీస్‌కు ఒక మెయిల్ వచ్చిందని ఆయన తాజాగా పేర్కొన్నారు. ఆ మెయిల్ భారత్ నుంచే వచ్చిందని ఆరోపించారు. వీపీఎన్ పద్ధతిలో పంపించారని, లోకేషన్ మాత్రం సింగపూర్ అని కనిపించిందని తెలిపారు. అదే డివైజ్‌కు మరో 13 ఐడీలు ఉన్నాయని, అన్నీ భారతీయుల పేర్లతోనే ఉన్నాయని అన్నారు. నకిలీ ఐడీ మహారాష్ట్ర లోకేషన్ చూపించిందన్నారు.
Also Read: PAK vs ENG: కోహ్లీసేనే కాదు.. కివీస్, ఇంగ్లాండ్ కూడా మా శత్రువులే: రమీజ్ రాజా
ఛౌదరి వ్యాఖ్యలపై బీసీసీఐ, భారత ప్రభుత్వంలో ఎవరూ స్పందించలేదు. ఆయన ప్రతిసారీ భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటారు. వాస్తవాలతో సంబంధం లేకుండా విచిత్రమైన లాజిక్కులతో భారత్‌ను విమర్శిస్తుంటారు. పాక్‌లో ఉగ్రవాదాన్ని భారతే ప్రోత్సహిస్తోందని గతంలో అన్నారు. సాధారణంగా ఆయన వ్యాఖ్యలకు ఎవరూ విలువివ్వరు!