మద్యం షాపు యజమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం షాపుల లైసెన్స్‌ గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మద్యం దుకాణాలు మూతపడిన నేపథ్యంలో లైసెన్స్‌లను నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వెల్లడించిన ప్రకారం నవంబర్ 1వ తేదీతో దుకాణాల గడువు ముగియాల్సి ఉంది. దీనిని నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, కొత్త విధానం నేపథ్యంలో పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 


Also Read: Wine Shop Reservations : మద్యం దుకాణాల్లో "గౌడ్‌"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?


మద్యం దుకాణాల్లో గౌడ కులానికి చెందిన వారికి 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గత కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. త్వరలో జరగబోయే మద్యం దుకాణాల టెండర్ల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 2021-23 వరకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉంటాయని పేర్కొంది. మద్యం పాలసీపై విధి విధానాలు రూపొందించాలని ఆబ్కారీ శాఖ మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి వైన్స్‌, బార్‌ లైసెన్స్‌లకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని సూచించారు. 


సీఎం కేసీఆర్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.. 
దేశంలోనే తొలిసారిగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినందుకు శ్రీనివాస్ గౌడ్‌కు పలువురు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read: Hyderabad Raid Today: కార్వీ ఆఫీసు, ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు.. బెంగళూరు పోలీసుల కస్టడీకి మాజీ ఎండీ పార్థసారధి


Also Read: Breaking News: భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి