ED Raids Karvy Office: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని కార్వీ ఆఫీసుతో పాటు సంస్థ మాజీ ఎండీ పార్థసారధి, ఇతర డైరెక్టర్లు, బాస్‌లు రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. డీ మ్యాట్ ఖాతాల నుండి షేర్‌లను బదలాయించడం ద్వారా భారీ మొత్తం కార్వీ యాజమాన్యం రుణాలు తీసుకుంది.
మనీ లాండరింగ్ కేసు
రూ. 350 కోట్ల మేర భారీ రుణాలను పొందిన సంస్థ.. ఈ మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదలాయించింది. దీంతో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కార్వీ సంస్థపై, డైరెక్లర్లు, ఉన్నతోద్యోగులపై అభియోగాలు నమోదయ్యాయి. కార్వీ కేసులో మాజీ ఎండీ పార్థసారధిని బెంగళూరు పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు తాజాగా అనుమతించింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కార్వీ సంస్థపై పలు కేసులు నమోదయ్యాయి.
Also Read: TTD High Court : 52 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
పీటీ వారెంట్‌పై విచారణ
వందల కోట్ల రుణాలు తీసుకుని వ్యక్తిగత ఖాతాలకు వాటిని బదలాయించి నిధులు గోల్ మాల్ చేశారని అభియోగాలున్నాయి. కస్టమర్ల నగదు ఏమైందనే కోణంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో సంస్థ మాజీ ఎండీ పార్థసారధితో పాటు సీఈవో రాజీవ్ రంజన్, సీఎఫ్‌వో కృష్ణహరిలను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. బెంగళూరు క్రైమ్ పోలీసులు నిందితుల పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టారు. నేటి ఉదయం నుంచి కార్వీ ఆఫీసుతో పాటు నగరంలోని పలు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. బంజారాహిల్స్, నానక్‌రాంగూడా, అమీర్‌పేట్ సహా సంస్థకు చెందిన ఆస్తులు, మాజీ ఎండీ, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లపై పలు చోట్ల సీఆర్‌పీఎఫ్ భద్రతతో ఈడీ తనిఖీలు కొనసాగిస్తోంది.
Also Read: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!
బెంగళూరు పోలీసుల కస్టడీకి నిందితులు..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మాజీ ఎండీ పార్థసారధిని బెంగళూరు పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 8న పార్థసారధిపై కేసు నమోదుచేశారు. వంద కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ కేసులో సంస్థ మాజీ ఎండీతో పాటు రాజీవ్ రంజన్, కృష్ణపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల పీటీ వారెంట్‌పై 3 రోజుల కస్టడీకి బెంగళూరు పోలీసులు అనుమతి కోరడంపై నాంపల్లి కోర్టు తాజాగా సమ్మతించింది. చంచల్‌గూడ జైలులోని నిందితులను కర్ణాటక పోలీసులు విచారించనున్నారు.