భారత పారాలింపియన్, షూటర్ సింగ్‌రాజ్ అధానా అంచనాలు అందుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మూడో స్థానంలో నిలిచాడు. కాంస్య పతాకాన్ని ముద్దాడాడు. దాంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మరో షూటర్ మనీష్ నర్వాల్ సైతం నేటి ఉదయం ఫైనల్ చేరుకున్నాడు. భారత్ సాధిచిన పతకాల సంఖ్య 8కి చేరింది. 









పారాలింపియన్, షూటర్ సింగ్‌రాజ్‌ అధానాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అభినందించారు. ‘అద్భుత ప్రదర్శన చేశావు. ఇండియా టాలెంటెడ్ షూటర్ సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకాన్ని సాధించాడు. అతడి శ్రమ, కష్టానికి ప్రతిఫలం ఈ ఒలింపిక్స్ పతకం. కాంస్యం సాధించిన షూటర్ కు అభినందనలు. అతడు మరెన్నో విజయాలు సాధించాలని’ ప్రధాని మోదీ ఆకాంక్షించారు.


Also Read: Paralympics 2020: అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర






టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షూటర్ సింగ్‌రాజ్ అధానా‌ను కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్‌నారాయణ్ ప్రశంసించారు. నువ్వు సాధించిన పతకం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ట్వీట్ చేశారు.


Also Read: స్వర్ణ పతక విజేత సుమిత్ అంటిల్‌కి ప్రధాని ఫోన్... ఏపీ సీఎం శుభాకాంక్షలు