టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా అతడెంతో ఎత్తుకు ఎదిగాడని పేర్కొన్నాడు. జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడని, ఎన్నో మార్పులు తీసుకొచ్చాడని కొనియాడాడు.  దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు మ్యాచ్‌కు ముందురోజు ఆయన మాట్లాడాడు.






వెస్టిండీస్‌పై 2011లో విరాట్‌ కోహ్లీ అరంగేట్రం మ్యాచ్‌ను ద్రవిడ్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ పోరులో మిస్టర్‌ వాల్‌ శతకం బాదేశాడు. అతడితో కలిపి విరాట్‌ 43 పరుగుల భాగస్వామ్యం పంచుకున్నాడు. 'కోహ్లీ తొలి మ్యాచులో నేనున్నాను. అతడితో కలిసి ఆడాను. ఇదో అద్భుతం. పదేళ్ల తర్వాత అతడు వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎంతో ఎదిగాడు' అని ద్రవిడ్‌ బీసీసీఐ టీవీతో చెప్పాడు.


'బ్యాటింగ్‌తో కోహ్లీ మ్యాచులు గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడాడు. జట్టును నడిపించిన తీరు, విజయాలు అందించిన వైనం చిరస్మరణీయం. జట్టులో అతడు ఫిట్‌నెస్‌, చైతన్యం, లక్ష్యానికి సంబంధించిన సంస్కృతులను ప్రవేశపెట్టాడు. బయట నుంచి అతడి ఆట చూడటం ఎంతో  బాగుంటుంది. ఇప్పుడు నేను జట్టులో ఉన్నాను. సాధ్యమైనంత వరకు సాయం చేస్తాను. అతడు నిలకడగా నిత్యం మెరుగవుతూనే ఉంటాడు' అని ద్రవిడ్‌ వివరించాడు.


దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆటడం సవాలేనని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. 'దక్షిణాఫ్రికా గొప్ప దేశం. ఇక్కడి క్రికెట్‌ పరిస్థితులు సవాళ్లు విసురుతాయి. దాంతో పాటు మ్యాచులు ఆడుతూ ఆస్వాదించొచ్చు. కుర్రాళ్లు మెరుగ్గా సన్నద్ధమై బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. కోచ్‌గా వారి నుంచి నేను కోరుకొనేది ఇదే' అని ఆయన వెల్లడించాడు.


Also Read: 83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?


Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్‌!


Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?


Also Read: IND vs SA: ద్రవిడ్‌ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!


Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!


Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్‌, కోహ్లీ ప్రశంసలు