ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ మెడల్ స్టాండింగ్స్‌లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. పురుషులు, మహిళలు, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో భారతదేశం పతకాల పంట పండించింది. దీంతో ఆరు బంగారు పతకాలు, ఆరు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది.
మొత్తం ఆరు బంగారు పతకాల్లో మను భకేర్ మూడు సాధించింది. పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మను బంగారు పతకం సాధించగా, రిథం సంగ్వాన్, శిఖా నర్వాల్‌లతో జతకట్టి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం ఈవెంట్‌లో కూడా గోల్డ్ కొట్టింది. వీరు బెలారస్‌ను 16-12తో ఓడించారు.
నవీన్, సరబ్‌జ్యోత్ సింగ్, శివ నర్వాల్ కలసి బెలారస్ పురుషుల జట్టుపై 16-14తో విజయం సాధించారు. ఈరోజు ప్రారంభంలో జూనియర్ మెన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం కూడా బంగారు పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం ఈవెంట్‌లో కూడా ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 180 షాట్లలో 1722 స్కోర్‌తో టాప్ పొజిషన్‌లో నిలిచింది. రెండో రౌండ్‌లో భారత్ 569 పాయింట్లను, బెలారస్ 568 పాయింట్లను సాధించింది.
Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్! బుడగ వీడిన క్రిస్‌గేల్.. ఎందుకంటే?
ఫైనల్‌లో మొదటి నుంచి పూర్తిస్థాయిలో భారత్ ముందంజలోనే ఉంది. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కూడా భారత్.. బెలారస్‌పై విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో భారతదేశానికి చెందిన నిషా కన్వార్, జీనా ఖిట్టా, ఆత్మిక గుప్తాలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్ చేసినా.. గోల్డ్ మ్యాచ్‌లో హంగేరీ చేతిలో ఓటమి పాలై రెండో స్థానానికి పరిమితం అయింది.
ఆత్మికకు ఇది రోజులో రెండో రజత పతకం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీంలో రాజ్‌ప్రీత్ సింగ్‌తో జత కట్టి రెండో స్థానాన్ని సాధించింది. రాజ్‌ప్రీత్ ఖాతాలో కూడా ఒక స్వర్ణ పతకం, రజత పతకం ఉన్నాయి.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!