Rishabh Pant News: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది జరిగిన ఐపీఎల్ మెగావేలం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో తనను ఒక జట్టు కొనుగోలు చేయకూడదని కోరుకున్ననాని, లక్కీగా తాను అనుకున్నట్లుగానే జరిగిందని వెల్లడించాడు. ఆ జట్టు పేరు పంజాబ్ కింగ్స్ అని తెలిపాడు. నిజానికి వేలానికి ముందు పంజాబ్ 112 కోట్లతో హైయస్ట్ పర్స్ మనీతో ఉంది. తను కావాలనుకుంటే ఏ ఆటగాడినైనా కొనుగోలు చేసే లెవల్లో ఉంది. వేలంలో తొలిరోజు శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్లో హైయస్ట్ ఖరీదైన కొనుగలో రికార్డు సాధించింది. పంజాబ్ తర్వాత 82 కోట్లతో మరో ఐపీఎల్ జట్టు రెండోస్థానంలో నిలిచింది. ఇక శ్రేయస్ కొనుగోలు చేసిన తర్వాత పంజాబ్ తనను పర్చేజ్ చేయదని భావించినట్లు తెలిపాడు. అయతే తాను పంజాబ్ తరపున ఎందుకు ఆడకూడదనుకున్నాడో మాత్రం తెలియ పర్చలేదు. 


ఐపీఎల్లో ఖరీదైన ప్లేయర్ గా పంత్..
శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన రికార్డును కొద్దిసేపట్లోనే పంత్ తిరగరాశాడు. పంత్ కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటి పడిన లక్నో సూపర్ జెయింట్స్ చివరికి పై చేయి సాధించింది. మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఎంటరవడంతో ఒకదశలో వేలం రూ.20.75 కోట్ల దగ్గర ఆగింది. ఈ దశలో తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ వాడటంతో రూ.27 కోట్లను లక్నో ఆఫర్ చేసింది. అంత ధర వెచ్చించలేక ఢిల్లీ వెనుకడుగు వేయంతో లక్నో అతడిని సొంతం చేసుకుంది. తాజాగా లక్నోకెప్టెన్ గా పంత్ ను జట్టు యాజమాన్యం ప్రకటించింది. అతని చేతే ఐపీఎల్ 2025కి సంబంధించిన జెర్సీని కూడా విడుదల చేయించింది. లక్నో తరపున ఫుల్ టైమ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న రెండో ప్లేయర్ పంత్ కావడం విశేషం. కేఎల్ రాహుల్ 2021-24 మధ్య ఆ జట్టుకు సారథ్యం వహించాడు. అడపాదడపా నికోలస్ పూరన్, క్రునాల్ పాండ్యా జట్టుకు కొన్ని మ్యాచ్ ల్లో నాయకత్వం వహించారు. 


అద్భుతమైన రికార్డు..
టీమిండియాకు పంత్ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. విధ్వసంకర బ్యాటింగ్ శైలి అతని సొంతం. నిమిషాల్లో ప్రత్యర్థి నుంచి గేమ్ ను తను లాగేసుకోగలడు. ఇండియా తరపున 76 టీ20లు ఆడిన పంత్ 1209 పరుగులు చేశాడు. 23.25 సగటుతో 128 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. మొత్తానికి తన టీ20 కెరీర్ ఇంకా బాగుంది. ఇప్పటివరకు 202 మ్యాచ్ లాడిన పంత్.. 5022 పరుగులు చేశాడు. 31.78 సగటుతో 145 స్ట్రైక్ రేట్ తో రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 25 అర్థ సెంచరీలు ఉండటం విశేషం. ఐపీఎల్లోకి తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున అడుగు పెట్టిన పంత్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2021 నుంచి 24 వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు. మధ్యలో గాయం కారణంగా 2023లో తను ఐపీఎల్ ఆడలేదు. 


Also Read: ICC Champions Trophy: సరికొత్త వివాదం.. టీమిండియా జెర్సీపై పీసీబీ అభ్యంతరం