KKR vs SRH Final LIVE Score: ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్, 10.3 ఓవర్లలో టార్గెట్ ఉఫ్
KKR vs SRH IPL Final 2024 LIVE Score: ఐపీఎల్ 2024 ఫైనల్లో చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
KKR vs SRH Final LIVE Score: కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో 10.3 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ (52 నాటౌట్), గుర్బాజ్ 39 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ 2012, 2014 తరువాత 10 ఏళ్లకు మరో ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది.
KKR vs SRH Final LIVE Score: 6 ఓవర్లలో KKR స్కోరు 72/1
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో 6 ఓవర్లలో కేకేఆర్ 72 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ 40, గుర్బాజ్ 21 రన్స్‌తో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 4 ఓవర్లలో KKR స్కోరు 46/1
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో 4 ఓవర్లలో కేకేఆర్ 37 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ 21, గుర్బాజ్ 14 రన్స్‌తో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 3 ఓవర్లలో KKR స్కోరు 37/1, టార్గెట్ 114
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో 3 ఓవర్లలో కేకేఆర్ 37 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ 19, గుర్బాజ్ 9 రన్స్‌తో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్, సునీల్ నరైన్ ఔట్
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కమిన్స్ బౌలింగ్ లో సునీల్ నరైన్ సిక్సర్ కొట్టాడు, ఆ మరుసటి బంతికి భారీ షాట్ ఆడి షాబాజ్ అహ్మద్ చేతికి చిక్కాడు. తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
KKR vs SRH Final LIVE Score: ఐపీఎల్ 2024 ఫైనల్లో కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ ఫైనల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అత్యధిక స్కోరు కెప్టెన్ పాట్ కమిన్స్ 24 రన్స్ చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ 24, భువనేశ్వర్ 0 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 17 ఓవర్లకు SRH స్కోర్ 108/8
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ 20, ఉనద్కత్ 3 పరుగులతో ఆడుతున్నారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, రస్సెల్ తలో 2 వికెట్లు తీశారు. అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు.
KKR vs SRH Final LIVE Score: 16 ఓవర్లకు SRH స్కోర్ 98/8
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ 11, ఉనద్కత్ 2 పరుగులతో ఆడుతున్నారు. నరైన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
KKR vs SRH Final LIVE Score: 15 ఓవర్లకు SRH స్కోర్ 90/8
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ 9, ఉనద్కత్ 0 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 14.1 ఓవర్లకు SRH స్కోర్ 90/8
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ 9, ఉనద్కత్ 0 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 14 ఓవర్లకు SRH స్కోర్ 90/7
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు క్లాసెన్ 16, పాట్ కమిన్స్ 9 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 13 ఓవర్లకు SRH స్కోర్ 82/7
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు క్లాసెన్ 13, పాట్ కమిన్స్ 5 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 7వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్
KKR vs SRH Final LIVE Score: 6వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్, షాబాజ్ అహ్మద్ 8 ఔటయ్యాడు.
KKR vs SRH Final LIVE Score: 11 ఓవర్లకు SRH స్కోర్ 70/5
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు క్లాసెన్ 11, షాబాజ్ అహ్మద్ 8 పరుగులతో ఆడుతున్నారు.
రస్సెల్ వేసిన ఈ ఓవర్లో మార్‌క్రమ్ (20) ఔటయ్యాడు.
KKR vs SRH Final LIVE Score: 9 ఓవర్లకు SRH స్కోర్ 58/4
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు క్లాసెన్ 8, మార్‌క్రమ్ 19 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 8 ఓవర్లకు SRH స్కోర్ 51/4
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు క్లాసెన్ 3, మార్‌క్రమ్ 18 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 7 ఓవర్లకు SRH 47/4 చేసింది. తెలుగు తేజం నితిష్ రెడ్డి 13 పరుగులకు ఔటయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మార్‌క్రమ్ 16 పరుగులతో ఆడుతున్నారు. హర్షిత్ రానా బౌలింగ్ లో కీపర్ కు క్యాచిచ్చి ఔటయ్యాడు నితీష్
KKR vs SRH Final LIVE Score: 6 ఓవర్లకు SRH స్కోర్ 40/3
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మార్‌క్రమ్ 15, నితిష్ 8 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 5 ఓవర్లకు SRH స్కోర్ 23/3
స్టార్క్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. మార్‌క్రమ్ 6, నితిష్ 1 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: స్టార్క్ మాయాజాలం, 3వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్ - త్రిపాఠి ఔట్
4.2 ఓవర్లకు SRH స్కోర్ 21/3
KKR vs SRH Final LIVE Score: 4 ఓవర్లకు SRH స్కోర్ 21/2
వైభవ్ ఆరోరా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. రాహుల్ త్రిపాఠి 9, మార్‌క్రమ్ 5 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 3 ఓవర్లలో SRH స్కోర్ 15/2
రాహుల్ త్రిపాఠి 7, మార్‌క్రమ్ 4 పరుగులతో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: నిప్పులు చెరిగిన కేకేఆర్ బౌర్లు, SRH ఓపెనర్లు ఔట్
రెండు ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఔటయ్యారు. SRH స్కోర్ 6/2
కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరోసారి మాయ చేశాడు. తొలి ఓవర్లోనే హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (2)ను బౌల్డ్ చేశాడు.
KKR vs SRH Final LIVE Score: కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వరుణ్ అరోరా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్‌రామ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, ఉనద్కత్, నటరాజన్.
ఐపీఎల్ 2024 ఫైనల్లో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే.. తాము బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని.. అదే జరిగిందన్నాడు. చెన్నైలోని చెపాక్ వేదికగా కేకేఆర్, హైదరాబాద్ ఫైనల్లో తలపడుతున్నాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న IPL 2024 ఫైనల్‌కు వర్షం ముప్పు కాస్త తక్కువగానే ఉంది. ప్రస్తుతానికి ఆకాశం మేఘాలతో ఉన్నా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడితే అదనంగా 120 నిమిషాలు అంటే 2 గంటలు సమయం ఇస్తారు. అయినా వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, రిజర్వ్ డే నాడు (సోమవారం) మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రెమాల్ తుఫాను ఎఫెక్ట్ వల్ల 2 రోజులు వాతావరణం అనుకూలించక మ్యాచ్ నిర్వహణ సాధ్యం అవకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.
Background
SRH vs KKR Final LIVE Score: ఐపీఎల్(IPL season 17 Final) అంతిమ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఫైనల్లో మాజీ ఛాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు తలపడుతున్నాయి. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన కోల్‌కతా ఐపీఎల్‌లో మూడో కప్పుపై కన్నేసింది. ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో సరికొత్తగా కనిపించిన హైదరాబాద్ రెండో కప్పును అందుకోవాలని భావిస్తోంది. గతంలో హైదరాబాద్‌కు చెందిన టీమ్ దక్కన్ ఛార్జర్స్ 2009లో రెండో సీజన్ ట్రోఫీ నెగ్గింది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న కేకేఆర్, సన్‌రైజర్స్ జట్ల మధ్య చెపాక్ వేదికగా హోరాహోరీ పోరుకు అంతా సిద్ధం చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -