IPL 2023 Auction Live: సెహ్వాగ్ మేనల్లుడు సన్‌రైజర్స్‌కు!
IPL 2023 Auction Live: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్ ఒకటి! ఆటగాళ్ల వేలంతో సరికొత్త సీజన్ సందడి మొదలవుతుంది. కోచి వేదికగా మినీ వేలం జరుగుతోంది.
అమిత్ మిశ్రాను రూ.50 లక్షల కనీస ధరకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ అల్లుడు మయాంక్ డాగర్‌ను సన్‌రైజర్స్ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ ప్రేరక్ మన్కడ్‌ను ఎల్‌ఎస్‌జీ రూ.20 లక్షలకు తీసుకుంది.
కైల్ జేమీసన్ బేస్ ప్రైజ్ రూ.కోటి. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బేస్ ధరకు కొనుగోలు చేసింది.
సందీప్ శర్మ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. అయినా అమ్ముడుపోకుండా ఉండిపోయాడు
రిలే మెరెడిత్ బేస్ ప్రైస్ రూ.1.50 కోట్లు. అయినా అమ్ముడుపోకుండా ఉండిపోయాయి.
శ్రీలంక ఆటగాడు దాసున్ షనకా బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. అమ్ముడుపోకుండా ఉండిపోయాయి.
అఫ్ఘానిస్తాన్ అత్యుత్తమ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ అమ్ముడుపోలేదు.
డారిల్ మిచెల్ బేస్ ప్రైస్ రూ.కోటి. అతన్ని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
డేనియల్ సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.
రొమారియో షెపర్డ్ ప్రాథమిక ధర రూ .50 లక్షలు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ బేస్ ధరకు కొనుగోలు చేసింది.
మన్దీప్ సింగ్, ట్రావిస్ హెడ్, డేవిడ్ మలన్ అమ్ముడుపోలేదు
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విక్ జాక్వెస్ బేస్ ప్రైజ్ రూ.1.50 కోట్లుగా ఉంది. అతడిని ఆర్సీబీ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది.
మనీష్ పాండేను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతన్ని రూ .2.40కోట్లకు విక్రయించారు. అతని బేస్ ప్రైస్ రూ.1 కోటి.
ఐర్లాండ్ ఆల్ రౌండర్ పాల్ స్టెర్లింగ్ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. అతను అమ్ముడుపోకుండా ఉండిపోయాడు.
శివమ్ మావి (రూ.6 కోట్లు)
ముకేష్ కుమార్ (రూ.5.50 కోట్లు)
వివర్తన్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్) - రూ.2.60 కోట్లు
కేఎస్ భరత్ (రూ.1.20 కోట్లు)
ఎన్ జగదీశన్ (రూ.90 లక్షలు) (కోల్‌కతా నైట్ రైడర్స్)
మోర్గాన్ అశ్విన్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అమ్ముడుపోకుండా ఉండిపోయారు.
ముఖేష్ కుమార్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ .5.50 కోట్లకు కొనుగోలు చేసింది.
శివమ్ మావి మావి బేస్ ధర రూ .40 లక్షలు. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ .6 కోట్లకు కొనుగోలు చేసింది
ముజ్తాబా యూసఫ్ ఇంకా అమ్ముడుపోలేదు
కెఎం ఆసిఫ్ అమ్ముడుపోలేదు
23 ఏళ్ల ఠాకూర్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ రూ .45 లక్షలకు కొనుగోలు చేసింది.
23 ఏళ్ల ఠాకూర్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ రూ .45 లక్షలకు కొనుగోలు చేసింది.
23 ఏళ్ల ఠాకూర్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ రూ .45 లక్షలకు కొనుగోలు చేసింది.
వైభవ్ అరోరా బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. అతన్ని కేకేఆర్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది.
ఉపేంద్ర యాదవన్ కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
శ్రీకర్ భరత్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది
ఎన్ జగదీశన్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ నడిచింది. చివరకు అతన్ని కేకేఆర్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది.
దినేష్ బనా అమ్ముడుపోలేదు. అతని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు.
శశాంక్ సింగ్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అవి అమ్ముడుపోకుండా ఉండిపోయారు. సుమిత్ కుమార్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. కానీ అతను కూడ అమ్ముడుపోలేదు.
నిషాంత్ సింధు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20 లక్షలకు సమర్థ్ వ్యాస్ ను కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
భారత ప్లేయర్స్ సౌరభ్ కుమార్, ప్రియమ్ గార్గ్. అభిమన్యు ఈశ్వరన్ అమ్ముడుపోలేదు. దక్షిణాఫ్రికాకు చెందిన కోర్బిన్ బోచ్ కూడా అమ్ముడుపోలేదు. అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఇండియా ఎ జట్టు తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడం ద్వారా వెలుగులోకి వచ్చాడు.
వివర్తన్ శర్మ ఆల్ రౌండర్ ఆటగాడు. అతని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. ఇతని కోసం కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వేలం పోటీ నడిచింది. చివరకు హైదరాబాద్ అతన్ని రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది.
అమ్ముడు పోని వాళ్లు- 18
అమ్ముడుపోని విదేశీయులు-12
అమ్ముడుపోని ఇండియన్ క్రికెటర్లు-6
చెన్నై సూపర్ కింగ్స్-3
ఢిల్లీ క్యాపిటల్స్-2
గుజరాత్ టైటాన్స్-2
లక్నో సూపర్ జెయింట్స్-2
ముంబై ఇండియన్స్-2
పంజాబ్ కింగ్స్-1
రాజస్థాన్ రాయల్స్-1
సన్‌రైజర్స్ హైదరాబాద్-5
రాయల్ ఛాలెంజర్స్-1
అన్మోల్ప్రీత్ సింగ్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. కానీ ఎవరూ కొనలేదు.
శుభమ్ ఖజురియా బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతన్ని ఎవరూ కొనలేదు.
రోహన్ కున్నుమ్మాల్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. అతను కూడా అమ్ముడుపోలేదు.
హిమ్మత్ సింగ్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. అతను అమ్ముడుపోకుండా ఉండిపోయాయి.
షేక్ రషీద్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బేస్ ధరకు కొనుగోలు చేసింది.
19 క్రికెటర్లు అమ్ముడుపోగా అందులో 14 మంది విదేశీ ఆటగాళ్లే.
ఆల్‌రౌండర్లు-6
బౌలర్లు-6
బ్యాటర్లు-4
వికెట్ కీపర్లు-౩
మయాంక్ మార్కండేను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
వెస్టిండీస్‌కు చెందిన అకీల్ హుస్సేన్, దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రైజ్ షంసీ, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా అమ్ముడుపోలేదు.
ఆదిల్ రషీద్ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
ఆస్ట్రేలియా బౌలర్ రిచర్డ్సన్‌ను ముంబై ఇండియన్స్ రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ అమ్ముడుపోలేదు. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.
ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ అమ్ముడుపోలేదు. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.
న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే అమ్ముడుపోలేదు. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.
జయదేవ్ ఉనద్కత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఫిలిప్ సాల్ట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఫిలిప్ సాల్ట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్.
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.
వెస్టిండిస్ ఆటగాడు నికోలస్ పూరన్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీ పడుతున్నాయి. పూరన్ ధర రూ.5 కోట్లు దాటింది. అతని బేస్ ప్రైస్ రెండు కోట్లు
బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ అమ్ముడుపోలేదు. అతని బేస్ ప్రైస్ రూ.50 లక్షలు.
బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. చివరి వరకు బిడ్ వేసిన సీఎస్కే స్టోక్స్‌ను రూ.16.25కోట్లకు కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ హాట్ కేక్‌లా మారాడు. అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ హాట్ కేక్‌లా మారాడు. అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
కామెరూన్ గ్రీన్‌పై ముంబై ఇండియన్స్ భారీగా ఖర్చు చేసింది. అతన్ని రూ.17.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ఎంపిక చేశారు. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసింది. హోల్డర్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్ ను గుజరాత్ టైటాన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్ ప్రైస్. సికందర్ రజాను పంజాబ్ కింగ్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. జింబాబ్వేకు చెందిన సికందర్ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు మాత్రమే.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కుర్రాన్ నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ వేలంలో 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కుర్రాన్ నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్, క్రిస్ మోరిస్ ల రికార్డును బద్దలు కొట్టాడు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ అమ్ముడు పోలేదు. ఆయన బేస్ ప్రైస్ కోటీ యాభై లక్షలు
రిలే రుస్సో, జో రూట్ కొనుగోలుదారులను మెప్పించలేకపోయారు. ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రుస్సో కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయారు. రూట్ బేస్ ప్రైస్ రూ.కోటిగా ఉంది. రుస్సో బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది.
అజింక్యా రహానెను చెన్నై సూపర్ కింగ్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది
మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 8కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది
ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ను సన్‌రైజర్స్ 13 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ రూ.8 కోట్లు దాటాడు
ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.
కేన్ విలియమ్సన్ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉన్న నిధులు -₹42,25,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- నలుగురు
మొత్తం ఆటగాళ్ళు- 12
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద ఉన్న నిధులు -₹8,75,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఆరుగురు
మొత్తం ఆటగాళ్ళు- 18
రాజస్థాన్ రాయల్స్ వద్ద ఉన్న నిధులు -13,20,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- నలుగురు
మొత్తం ఆటగాళ్ళు- 16
పంజాబ్ కింగ్స్ వద్ద ఉన్న నిధులు -₹32,20,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఐదుగురు
మొత్తం ఆటగాళ్ళు- 16
పంజాబ్ కింగ్స్ వద్ద ఉన్న నిధులు -₹20,55,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఐదుగురు
మొత్తం ఆటగాళ్ళు- 16
ముంబై ఇండియన్స్ వద్ద ఉన్న నిధులు -20,55,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఐదుగురు
మొత్తం ఆటగాళ్ళు- 16
లక్నో సూపర్ జెయింట్స్ వద్ద ఉన్న నిధులు -₹23,35,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- నలుగురు
మొత్తం ఆటగాళ్ళు- 15
కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద ఉన్న నిధులు -₹7,05,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఐదుగురు
మొత్తం ఆటగాళ్ళు- 14
గుజరాత్ టైటాన్స్ వద్ద ఉన్న నిధులు -₹19,25,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఐదుగురు
మొత్తం ఆటగాళ్ళు- 18
ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉన్న నిధులు- ₹19,45,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్- ఆరు మంది
మొత్తం ఆటగాళ్ళు- 20
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ఉన్న నిధులు- ₹20,45,00,000
ఓవర్సీస్ ప్లేయర్స్ సంఖ్య- 6
మొత్తం ఆటగాళ్ళు- 18
భారత స్టార్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. అమిత్ మిశ్రాను గతసారి ఏ జట్టు తీసుకోలేదు. అయితే, తక్కువ బడ్జెట్లో, అమిత్ మిశ్రా చాలా జట్లకు బాగా ఉపయోగపడగలడు. కానీ ఈసారి ఏం చేస్తారో చూడాలి.
ఐపీఎల్ మినీ వేలానికి ముందు క్రిస్ గేల్ ఆర్సీబీని తన జట్టుగా అభివర్ణించాడు. ఆర్సీబీ ఎప్పుడూ తన జట్టుగానే ఉంటుందని క్రిస్ గేల్ అన్నాడు. క్రిస్ గేల్ కూడా పంజాబ్ కింగ్స్ పై తీవ్ర విమర్శలు చేశాడు. పంజాబ్ కింగ్స్ తమ ఆటగాళ్లను నమ్మదని, వేలం ముందు వారిని విడుదల చేస్తుందని గేల్ చెప్పాడు.
మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ కోసం చూస్తోంది. రాజస్థాన్ పెద్ద బడ్జెట్ ప్లేయర్ పై డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేయడానికి రాజస్థాన్ కూడా ఒకే విదేశీ ఆటగాడిపై పందెం వేయవచ్చు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వేలంలో పాల్గొంటుంది. పంజాబ్ కింగ్స్ మరోసారి జట్టును బలోపేతం చేయాలని చూస్తోంది. అయితే, పంజాబ్ కింగ్స్ కూడా ప్రతిసారీ ఆటగాళ్లను విడుదల చేయడం విమర్శలకు గురవుతుంది.
ముంబై ఇండియన్స్ బౌలింగ్ గతంతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంది. గత సీజన్లో పేలవమైన బౌలింగ్ కారణంగా ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముంబై ఇండియన్స్ తమ జట్టులో మంచి స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
మినీ వేలంలో కెకెఆర్‌కు అతిపెద్ద ఇబ్బందిగా మారనుంది. కేకేఆర్ బడ్జెట్ రూ.7 కోట్లు మాత్రమే. కేకేఆర్‌లో 11 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం రూ.7 కోట్లకు 11 స్లాట్లను భర్తీ చేయడం అంటే ఏ పెద్ద ఆటగాడిపై కూడా డబ్బులు పెట్టే పరిస్థితి లేదు.
గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ వేలానికి ముందే తన పెద్ద ఆటగాళ్లందరినీ వదలేసిందది. మినీ వేలంలో హైదరాబాద్ రూ .42కోట్ల భారీ బడ్జెట్ కలిగి ఉన్నందున దీని నుంచి ప్రయోజనం పొందాలను చూస్తోంది. ఈ బడ్జెట్‌లో మూడు నుంచి నాలుగు బడా ఆటగాళ్లను కొనుగోలు చేయడంపైనే హైదరాబాద్ దృష్టి ఉంటుంది. కొత్త కెప్టెన్ కోసం కూడా హైదరాబాద్ వెతుకుతోంది.
మినీ వేలం కోసం 405 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 10 జట్లలో 87 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 87 స్లాట్లను భర్తీ చేయడానికి జట్లకు రూ .206 కోట్ల బడ్జెట్ ఉంది.
ఈసారి మినీ వేలం కొచ్చిలో జరుగుతోంది. మినీ వేలం నిర్వహణపై కూడా పలు ప్రశ్నలు తలెత్తాయి. అయితే మినీ వేలం కొచ్చిలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మినీ వేలం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.
మినీ వేలంలో బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కరన్ వంటి పెద్ద ఆల్ రౌండర్లపై అతిపెద్ద కన్ను పడింది. మొత్తం 10 జట్లకు వారి సమతుల్యతను మెరుగుపరచడానికి ఆల్ రౌండర్లు అవసరం. ఈ ముగ్గురు ఆటగాళ్లకు అత్యధిక డిమాండ్ ఉండబోతోంది. ఈ ముగ్గురు ఆటగాళ్ల వేలానికి సంబంధించిన పాత రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశం ఉంది.
Background
IPL 2023 Auction Live:
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్ ఒకటి! ఆటగాళ్ల వేలంతో సరికొత్త సీజన్ సందడి మొదలవుతుంది. ఈ సారి డిసెంబర్ 23న కోచి వేదికగా మినీ వేలం జరుగుతోంది. ఏ ఫ్రాంచైజీలు ఎవరిని కొనుగోలు చేస్తాయి? ఏ క్రికెట్‌ర్ ఎక్కువ పలుకుతాడు? ఎవరి కోసం ఎక్కువ పోటీ ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్, బ్రాడ్ కాస్టింగ్, టైమింగ్, ఇతర వివరాలు మీకోసం!
వేర్వేరు బ్రాడ్‌కాస్టర్లు
ఈ సారి ఐపీఎల్ ప్రసార హక్కులను రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. టీవీ, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా తీసుకుంది. డిజిటల్ లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను వయాకామ్18-రిలయన్స్ కైవసం చేసుకుంది. జియో యూజర్లు, జియో సినిమా యూజర్లు ఉచితంగానే ఐపీఎల్ మిని వేలాన్ని చూడొచ్చు. గతానికి భిన్నంగా 4K క్వాలిటీతో ప్రసారం ఉంటుందని సమాచారం. ఇక టీవీలో స్టార్‌స్పోర్ట్స్‌లో వస్తుంది.
ఐపీఎల్ 2023 వేలం లైవ్ స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్టింగ్ వివరాలు
జియో వినియోగదారులు ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టెలికాస్ట్ చేస్తోంది. ప్యాకేజీ ఉన్నవాళ్లు ఆక్షన్‌ను ఆస్వాదించొచ్చు. ఇక లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో ప్రసారం అవుతుంది. జియో టీవీ యాప్స్‌లోనూ వేలాన్ని చూడొచ్చు. డిసెంబర్ 23న వేలం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆరంభం అవుతుంది. వేదిక కోచి.
ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు?
మొత్తం 405 మంది ఆటగాళ్లు వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 273 మంది భారతీయులు. 132 మంది విదేశీయులు. అందులో నలుగురు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. జాతీయ జట్లకు ఆడిన వారు 119, ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని వారు 282, అసోసియేట్ దేశాల నుంచి 4 ఉన్నారు. గరిష్ఠంగా 87 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అంఉదలో 30 విదేశీయులకు కేటాయించారు.
కనీస ధర రూ.2 కోట్ల విభాగంలో ఎవరున్నారు?
టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, తైమల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిన్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, రిలే రొసొ, రసి వాన్‌డర్ డుసెన్, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్
పెరగనున్న ప్రైజ్ మనీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అత్యంత ధనిక బోర్డు. లీగ్ విలువ సైతం ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 ప్రైజ్ మనీ పెంచుతారని వినికిడి. ప్రస్తుతం ఐపీఎల్ మొత్తం ప్రైజ్ మనీ రూ.46.5 కోట్లు. ఈ ప్రైజ్ మనీ ప్రపంచంలోని ఇతర క్రికెట్ లీగ్‌ల కంటే ఎక్కువ. ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు ఇస్తారు. కాగా రన్నరప్‌కు రూ.13 కోట్లు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు లభిస్తాయి. ఈ విధంగా మొత్తం రూ.46.5 కోట్లుగా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -