Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!

మూడు దశాబ్దాలుగా ఖాన్ హీరోలు, ఖాందాన్‌ల వచ్చిన హీరోలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో హిందీలో నయా సూపర్ స్టార్ వచ్చాడని విక్కీ కౌశల్ ప్రశంసలు అందుకుంటున్నాడు. కత్రినా భర్త నుంచి నటుడిగా పేరు తెచుకున్నాడు.

Continues below advertisement

గడచిన పాతికేళ్లలో బాలీవుడ్‌లో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే అంటే నమ్మ గలరా...!? హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ మాత్రమే ఆ స్థాయి అందుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు, స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం వరుస హిట్లతో పాటు నటన పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విక్కీ కౌశల్ బాలీవుడ్ నయా సూపర్ స్టార్‌గా అవతరించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'చావా' సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయితే... మరాఠా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

Continues below advertisement

బాలీవుడ్‌లో ఇప్పటికీ 30 ఏళ్ల క్రితం హీరోలదే హవా!
షారుఖ్, సల్మాన్, ఆమిర్ - ఖాన్ హీరోలతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లు 90ల నాటి సూపర్ స్టార్లు. ఇప్పటికీ వీరిదే హవా. ఈ హీరోల పేరు మీద జరిగే బిజినెస్ ఇప్పటికీ హిందీ బాక్స్ ఆఫీస్‌కు ప్రాణం. గడిచిన పాతికేళ్ళలో అంటే 2000 తర్వాత హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇద్దరే ఆ రేంజ్ స్టార్‌డమ్ అందుకున్నారు. వాళ్ళే 2000లో 'కహోనా ప్యార్ హై'తో ఓవర్ నైట్ స్టార్ అయిన హృతిక్ రోషన్, 2007లో 'సావరియా'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబీర్ కపూర్. వీళ్ళిద్దరి పేరు మీద జరిగే బిజినెస్, యూత్‌లో వీళ్ళకున్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్. ఈ పాతికేళ్లలో ఎంతోమంది వారసులు, నటులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా వీళ్ళ రేంజ్ అందుకోలేకపోయారు. అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ నుంచి ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ వరకూ ఇదే తంతు. వీరిలో కొందరికి నటులుగా పేరుపడ్డా భారీ సక్సెస్‌లు దక్కలేదు. ఇక రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి వాళ్ళకు కంటిన్యూటీ సమస్య. పైపెచ్చు నెపోటీజం బాధ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత  బాలీవుడ్ సరికొత్త సూపర్ స్టార్‌గా విక్కీ కౌశల్ అవతరిస్తున్నాడు.

హాస్టల్ లాంటి ఇంటి నుండి సూపర్ స్టార్ స్థాయికి!
ముంబయిలోని ఒక ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌషల్ కొడుకే ఈ విక్కీ కౌశల్. ముంబైలోని ఆల్మోస్ట్ ఒక మురికివాడ లాంటి సంబర్బన్ ప్రాంతంలో ఉండే హాస్థల్స్ లాంటి బిల్డింగ్స్ (chawl)లో ఉండే వందలాది కుటుంబాల్లో వీళ్లదీ ఒకటి. చదువు పూర్తయ్యాక సినిమాల మీద ఇష్టంతో దర్శకుడు అనురాగ్ కాశ్యప్ వద్ద 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' లాంటి సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాడు. వాటిలో పేరు లేని చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. తర్వాత ఒక ఇండిపెండెంట్ సినిమా 'మసాన్' (2015)లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత తన గురువు తీసిన 'రమణ్‌ రాఘవ్ 2.0'లో హీరో లాంటి విలన్ పాత్రతో విక్కీకి బ్రేక్ దొరికింది. అలాగే సంజయ్ దత్ జీవితం ఆధారంగా వచ్చిన 'సంజు'లో ఫ్రెండ్ కమలేష్ పాత్రలో నటనకు విక్కీకి అవార్డులతో పాటు ఆడియన్స్‌లోనూ క్రేజ్ ఏర్పడింది. అయితే హీరోగా అతడిని నిలబెట్టింది మాత్రం 'ఉరి - సర్జికల్ స్ట్రైక్' (2019). దానిలో నటనకు విక్కీ కౌశల్ (Vicky Kaushal First National Award)కు నేషనల్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఫ్రీడం ఫైటర్ ఉద్దామ్ సింగ్ జీవిత కథతో 2021లో వచ్చిన 'సర్దార్ ఉద్దామ్' సినిమాలో విక్కీ నటనకు హిందీ ప్రేక్షకులు జై కొట్టారు. కచ్చితంగా ఆ ఏడాది రెండో నేషనల్ అవార్డు వస్తుందని భావించినా... 'పుష్ప' సినిమాలో నటించిన అల్లు అర్జున్‌కు వెళ్ళిపోయింది.

Also Read: సాంబార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు, సాంబార్‌కు సంబంధం ఏంటి?

భారతదేశపు మాజీ ఫీల్డ్ మార్షల్ మానిక్ షా జీవిత కథ ఆధారంగా వచ్చిన 'సామ్ బహద్దుర్'తో మరో మరపురాని నటనను ప్రదర్శించాడు విక్కీ కౌశల్. వీటితో పాటు 'బ్యాడ్ న్యూజ్', 'గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' లాంటి కమర్షియల్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతోన్న విక్కీ కౌశల్‌కు 'చావా' సూపర్ స్టార్ హోదా ఇచ్చింది. ఈ సినిమాతో మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. ప్రస్తుతం ఆయన పేరు మీద సినిమాల బిజినెస్ జరిగే పరిస్థితి ఏర్పడింది అనేది బాలీవుడ్ ట్రేడ్ వర్గాల కథనం.

కత్రినాతో విక్కీ కౌశల్ వివాహం... సర్‌ప్రైజ్!
సినిమాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే విక్కీ కౌశల్‌కి ఆరాధన ఉండేది. నటుడిగా స్థిర పడ్డాక ఆమెనే ప్రేమించి 2021లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె విక్కీ కంటే ఐదేళ్లు పెద్ద. రెండు మూడేళ్ల క్రితం వరకూ కత్రినా కైఫ్ భర్త అనే ముద్ర నుండి ఈ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన విక్కీ కౌశల్  సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటారు బాలీవుడ్ క్రిటిక్స్.

Also Read: చావు సిగ్గుతో తలదించుకున్న వేళ... ఛత్రపతి శంభాజీ మహారాజును ఔరంగజేబు ఎంత దారుణంగా చంపించాడంటే?

Continues below advertisement