Satyabhama Serial Today Episode మన బంధానికి నువ్వు విలువ ఇవ్వడం లేదు సీరియస్‌గా తీసుకోవడం లేదని సత్య క్రిష్‌తో చెప్తుంది. నర్శింహ మెడ మీద కత్తి పెట్టి నేను గుర్తొచ్చి ఆగిపోయాను అన్నావ్ కానీ అదే మీ బాపు మాట గుర్తొచ్చుంటే ఏం జరిగేది.. ఎవరి మాటో గుర్తొచ్చి ఆగిపోతే అది మార్పు కాదని వేరే వారి మాటలు నీ మీద ప్రభావం చూపిస్తే అది నీకే నష్టమని సత్య క్రిష్‌తో చెప్తుంది. మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉండకపోతే మరొ వ్యక్తికి బానిస అయిపోతావని అంటుంది. ఇప్పటి నుంచే నీకు నువ్వే ఈ క్షణం నుంచి మార్పు మొదలు పెట్టని చెప్తుంది.


సత్య మాటలకు క్రిష్ బూస్టింగ్ కావాలని నాలుగైదు  ముద్దులు.. రెండు మూడు హగ్‌లు ఇవ్వమని అంటాడు. దానికి సత్య సరే అని చెప్పి తన ఫొటో తీసి ఇచ్చి మీ వాడికి ఏవేవో కావాలంట ఇచ్చేయ్ అంటుంది. ఇక క్రిష్ ఈ సత్య వెళ్లిపోగానే ఫొటోతో నా జీవితం నవ్వులాట అయిపోయింది నువ్వు నవ్వు.. నేను మారుతా నీతో ముద్దులన్నీ వసూలు చేసుకుంటా అప్పటి వరకు ఈ ఫొటోతో ఎడ్జస్ట్ అయిపోతా అనుకుంటాడు. సత్య బయటకు వెళ్లగానే మహదేవయ్య చూసి పిలుస్తాడు. 


మహదేవయ్య: ఏం లేదు నీ దాకా వచ్చిన ఎమ్మెల్యే పోస్ట్ అడ్డుకున్నా కదా.  ఎలక్షన్లు రద్దు చేయించా కదా నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూడాలని ముచ్చటేసింది అందుకే ఆపాను. కళ్లు మస్త్ ఉబ్బినట్లున్నాయి రాత్రంతా ఏడ్చావా ఓదార్చాలా.
సత్య: ఎమ్మెల్యే అవ్వాలని కలలు కన్నది మీరు డబ్బు పంచింది మీరు.. నాకు ఎందుకు బాధ ఉంటుంది. 
మహదేవయ్య: ఎమ్మెల్యే అవుతానని ఛాలెంజ్ చేసింది ఎవరో.
సత్య: ఛాలెంజ్‌లో గెలిచింది నేనే కదా. పులిలా ఉన్న మీరు పిల్లిలా మారిపోయారు. నేను గెలుస్తాను అనగానే దొంగ దెబ్బ తీశారు. మీ మీద గెలిచినట్లు కాదా. 
మహదేవయ్య: ఎమ్మెల్యే కాకపోతే నీ ఇజ్జత్ పోయినట్లే కదా. అవి చేస్తా ఇవి చేస్తా అని హమీలు ఇచ్చావ్ కదా.
సత్య: నేను చేయాల్సిన సేవ కచ్చితంగా చేస్తా. ఎమ్మెల్యే పదవి ఉండుంటే ఇంకా బలం ఉండేది. అయినా నేనే ఏదీ ఆపను. పై పైకి మీరు నవ్వుతున్నా లోలోపల మీ మనసు కుళ్లి కుళ్లి ఏడుస్తుందని నాకు తెలుసు. 
మహదేవయ్య: ఎలక్షన్ ఆగిపోతే నీ మీద నా పగ ఆగదు. నీ చెల్లి జీవితం మా చేతిలో ఉంది.
సత్య: నా చెల్లికి ఏమైనా అయితే మీ చిన్న ఊరుకోడు. క్రిష్ నా మనిషి, నా సొంత మనిషి.. ఇక నుంచి మీ మాట వినడు. మామయ్య కాని మామయ్య. ఇకపై మీరు ఏం చేసినా నేను శాశ్వతంగా దూరం అవుతానని క్రిష్‌కి బాగా తెలుసు.
మహదేవయ్య: నీ గది వరకే వాడు నీ కొడుకు గది దాటి వస్తే వాడు నా కొడుకు అది మర్చిపోవద్దు.


హర్ష రెడీ అవుతుంటే నందిని కాఫీ తీసుకొస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నందిని కాల్ చేస్తుంది. హర్ష మైత్రి అనకుండా మాటి మాటికి మైత్రిని నందిని అనేస్తాడు. మైత్రి చిరాకుపడుతుంది. ఇక డాక్యుమెంట్లు రెడీ అయిపోయావని సంతకం పెట్టడానికి రమ్మని పిలుస్తుంది. ఇక నందిని హర్షతో అక్కడికి వెళ్లామా సంతకం చేశామా ఆఫీస్‌కి వెళ్లామా అన్నట్లు ఉండాలని చెప్తుంది. దానికి హర్ష లేకపోతే దాంతో కాపురం చేస్తాను అనుకుంటున్నావా అని అంటాడు. అలా అయితే ఊరుకుంటానా చంపేస్తా అని నందిని అంటుంది. ఇక మైత్రి హర్ష వస్తాడని తన ఫ్రెండ్‌తో మత్తు మందు ట్యాబ్లెట్స్ తెప్పిస్తుంది. ఈ రోజుతో నువ్వు నా సొంతం హర్ష అని హర్ష కోసం ఎదురు చూస్తుంటుంది. 


క్రిష్ పడుకొని లేచి ఉదయం భార్యలు కూల్‌గా ఉంటారు సత్య కాఫీ తీసుకొని రాగానే చేయి పట్టుకొని లాగేయాలని పడుకున్నట్లు నటిస్తాడు. సత్య వచ్చి క్రిష్ మారే వరకు ముట్టుకోను అనుకొని కాఫీ టేబుల్ మీద పెట్టి క్రిష్ యాక్టింగ్ కనిపెట్టేసి బొద్దింక అని అరుస్తుంది. దాంతో క్రిష్ లేచి ఎక్కడా అని అడిగితే కాఫీ కప్పు చూపించి అక్కడ తీసుకొని తాగు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక సత్య బట్టలు ఆరేస్తుంటే క్రిష్ కాఫీ తాగుతూ ఫోన్‌లో కందిరీగ లాంటి నడుము నడుము అంటూ పాటలు వేస్తాడు. సత్య కొంచెం కూడా నవ్వడం లేదని అనుకుంటాడు.


ఇంతలో ఓ రౌడీ క్రిష్ దగ్గరకు వచ్చి ఎప్పటి నుంచో వెతుకుతున్న వాడు దొరికాడు చితక్కొట్టేద్దాం రా అని పిలుస్తాడు. సత్య దగ్గర దొరికిపోయానని అనుకున్న క్రిష్ కొట్లాట ఎందుకురా వాడికి కాఫీ కప్పు ఇచ్చి చెప్దామని అంటాడు. కాళ్లు చేతులు విరగొట్టకుండా ఇలా ఏం మాట్లాడుతున్నారేంటి చిన్నయ్య గారు అని అతను క్రిష్‌ని లాక్కొని వెళ్తాడు.  ఆయన లాక్కెళ్లడంతో క్రిష్ ఆ పనోడిని కొట్టి కాఫీ కప్పు విసిరేస్తాడు. సత్య చూడగానే అది కోపం కాదు సత్య అని అంటాడు. సత్య మనసులో నిన్ను మార్చడం నా వల్ల కాదు అనుకుంటుంది. కోపం దాచుకోవడానికి నేనేమైనా ఆకులు అలములు తింటున్నానా అని క్రిష్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!