IPL 2022 rcb vs rr yuzvendra chahal troubles dinesh karthik so as sanju samson vs wanindu hasarnga : ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఎప్పుడెలా ఆడుతుందో తెలియడం లేదు. ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని మ్యాచుల్లో అదరగొట్టింది. మరికొన్ని మ్యాచుల్లో బెదిరిపోయింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో 68కే ఆలౌటై 'ఇదేందిది'! అనిపించింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ రూపంలో దానికి మరో గండం ఎదురవుతోంది.
ఎడమచేతి వాటం పేసర్లు ఫామ్‌లో ఉంటే బెంగళూరు విలవిల్లాడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచులో ఇలాగే జరిగింది. మార్కో జన్‌సెన్ ధాటికి తట్టుకోలేక ఇబ్బంది పడింది. అందుకే ఈ మ్యాచులో ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్‌ని సంజు శాంసన్ కచ్చితంగా వాడుకుంటాడు. అలాగే భీకరమైన ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌కు యుజ్వేంద్ర చాహల్‌తో ముప్పు ఉంది. ఇక రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌ను వనిందు హసరంగ ఆటాడుకుంటున్నాడు.
ఈ సీజన్లో దినేశ్ కార్తీక్‌ను (Dinesh Karthik) బెంగళూరు మ్యాచ్ ఫినిషర్‌గా ఉపయోగించుకుంటోంది. అందుకు తగ్గట్టే అతడు భీకరంగా హిట్టింగ్ చేస్తున్నాడు. సునాయసంగా మ్యాచులు గెలిపిస్తున్నాడు. పేసర్లనైతే ఉతికి ఆరేస్తున్నాడు. స్పిన్‌లోనూ ధాటిగానే ఆడుతున్నా రిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడుతున్నాడు. అందుకే ఈ మ్యాచులో డీకేకు యూజీతో పోరు తీవ్రంగానే ఉండనుంది. ఈ లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో డీకే కేవలం 83 స్ట్రైక్‌రేట్‌తోనే పరుగులు చేస్తున్నాడు. పైగా తొమ్మిది ఇన్నింగ్సుల్లో 3 సార్లు వికెట్ ఇచ్చేశాడు.
ఇక సంజు శాంసన్‌కు వనిందు హసరంగతో (Sanju Samson vs Wanindu Hasaranga) చిక్కు ఎదురవుతోంది. అతడు వేసే గూగ్లీలకు ఇబ్బంది పడుతున్నాడు. ఐదు ఇన్నింగ్సుల్లో 15 బంతులు ఎదుర్కొని 4 సార్లు ఔటయ్యాడు. ఈ గణాంకాలు చూస్తుంటేనే సంజూకు అతడంటే హడల్ అని అర్థమవుతోంది. ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచులోనైతే చాలా సాఫ్ట్ డిస్మిసల్‌గా వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఇప్పటి వరకు కోహ్లీ ఔటవ్వలేదు. కానీ అతడున్న ఫామ్‌కి బౌల్ట్ ఇన్‌స్వింగర్లు, ఔట్ స్వింగర్లు ఎదుర్కోవడం కష్టమే.
RCBదే కాస్త పైచేయి!